మీతో చెప్పాలనుకున్నా!!!
” సంక్రాంతి శోభ ”
ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ….
ముందుమాట:-   సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది పల్లెటూర్లు; పచ్చని పంటపొలాలు; చిరునవ్వులు చిందించే రైతన్నలు. పంటలు సమృద్ధిగా పండి, రైతన్నలు సుభిక్షంగా, ఆనందంగా వుండటం మనం చూసాం; కొన్నిసార్లు కరువుకాటకాలతో రైతన్నలు ఖిన్నులైవుండటాన్నీ చూసాం గతంలో. అయితే, నేటి పరిస్థితులలో, నదీజలాలు తగినంతలేక, నీటి బావులపై ఆధారపడిన రైతు, విద్యుత్ కోతలతో సతమతమవుతూ, ఆత్మహత్యలకు బలిఅవుతున్నాడు. అంటే, సంక్రాంతి కొంత కళను పోగొట్టుకుంటున్నది. ఇది మనందరికీ బాధాకరమే. అయితే, ఇటువంటి పరిస్థితులు రాకుండా, లేకుండా, రైతన్నల జీవితాలలో ఇకనుంచి మళ్ళీ ‘సంక్రాంతి’ వెలుగులు చిమ్మాలని ఆకాంక్షిస్తూ… … … మునుపు నేను చూసి, అనుభవించి, వర్ణించి, ప్రచురించిన ఆ సంక్రాంతి శోభను మరొకసారి మీముందుకు తీసుకువస్తున్నాను. ఇక ముందుకు చదవండి …
సంక్రాంతి పండుగ. ఒక్క రోజుకోసం మా ఊరు గుంటూరు వెళ్ళివచ్చాను. నా చిన్నప్పడు, అరవై-డెబ్భై ప్రాంతాల్లో, గుంటూరు పట్టణంలోకూడా, గ్రామాల్లో కనిపించేంత పండుగ వాతావరణం కనబడేది. అందరి ఇళ్ళముందు ముగ్గుల రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు; గొబ్బెమ్మల్లో గుచ్చిన ఎర్రమందారాలు, బంతిపూవులు. అదొక వింతైన శోభ. ఇంకా మంచు పడుతుండగానే, నులివెచ్చని సూర్యకిరణాలు వచ్చీరాకముందే, హరిదాసులు పాటలు పాడుకుంటూ, మధ్యమధ్యలో, “హరిలోరంగ హరి” అని పెద్దగా ఎలుగెత్తుతూ, ఇంటింట ఇచ్చిన బియ్యం, పప్పుల్ని తీసుకొని, దీవించి వెళ్తూవుండేవారు. ఆ సంగతులన్నీ నా మదిలో మరొకసారి మెదిలాయి. కానీ, సమయంలేక, మర్రోజు ప్రొద్దునే రైలెక్కి హైద్రాబాద్ రావాల్సివచ్చింది.
ప్రొద్దున్నే పల్నాడు రైలు ఎక్కి బయలుదేరాను. చాలా చలిగా వుంది. ఎవరూ రైలు కిటికీలు తెరవటంలేదు. వేడివేడి కాఫీ తాగుతున్నారు. నేను మాత్రం కెటికీ తెరిచి, కదులుతున్న రైలు నుంచి ప్రకృతి అందాలను చూస్తున్నాను. నెమ్మది, నెమ్మదిగా బాల సూర్యుని కాంతి కిరణాలు, తెల్లని మంచు తెరలను కరిగిస్తున్నాయి. భూమాత తెల్లని మంచు దుప్పటితో కప్పినట్లుంది. ఏడు గంటల సమయమయింది. రైలు పట్టాలవెంబడి గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పండగ సందడి కనిపిస్తున్నది. చిన్న,చిన్న గుడిసెలకు, మిద్దెలకు, చిన్న మేడల గుమ్మాలకు రంగురంగుల బంతిపూల తోరణాలు కట్టబడివున్నాయి. వరి, జొన్న కంకులను గుమ్మాలకు వ్రేలాడదీసారు. ప్రతి ఇళ్ళు ఒక కొత్త పెళ్ళికూతురు ముస్తాబై వున్నట్లుగా అనిపించింది నాకు. రంగురంగుల పరికిణీలు కట్టిన ఆడపిల్లలు హుషారుగా ఊళ్ళో తిరుగుతున్నారు.
ఇంకా వివరంగా చూడాలన్నా రైలు వేగంగా పరుగెడుతున్నది. ఒక గ్రామం దాటగానే, చాలా దూరంవరకు పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. మరల చిన్న,చిన్న గ్రామాలు వస్తున్నాయి. చెట్లు పెరిగి వుంటంలో, కొన్ని గ్రామాలు కనిపించటంలేదు. కేవలం ఇళ్ళళ్ళనుంచి వంట పొగ మాత్రం కనిపిస్తున్నది. ఇక నా దృష్టి పొలాలమీద పెట్టాను. అప్పటికే, పొలాల్లో పనులు జరుగుతున్నాయి. చాలాచోట్ల వరి కోతలు అయిపోయినట్లున్నాయి. పొలం మధ్యలో కోసిన వరిపంటను ఎత్తుగా గుడిసెల్లాగా వేసివుంచారు ఎండటానికోసమని. ఇంకా వరికోతలు కోయని పొలాలు ఆకుపచ్చని తివాసీలాగా కనిపిస్తున్నాయి. భూదేవి, సంక్రాంతి లక్ష్మీ రూపంలో, ఆకుపచ్చని పట్టుచీరె కట్టుకొని వచ్చిందా అన్నట్లు భూమి కనిపిస్తున్నది. చేల గట్లెంబడి విరగబూసిన రంగురంగుల బంతిపూలు ఆ సంక్రాంతిలక్ష్మి కట్టుకున్న ఆకుపచ్చని చీరెకు అంచుల్లాగా కనిపిస్తున్నాయి. ఏదో తెలియని అనుభూతి. ఒక్కసారి గుండెలనిండా గాలి పీల్చుకున్నాను దీర్ఘంగా. గుండెలు చల్లటి గాలితో బరువెక్కాయి. ఒక్కసారి చలికి వళ్ళు జలదరించింది. అయినా ఏదో సంతృప్తి ఆ భూదేవిని చూస్తుంటే. వరి పొలాలు ప్రక్కనే మిరపతోటలు. ఆకుపచ్చని ఆకులు, పండిన ఎర్ర మిరపకాయలు. వాటిని చూస్తుంటే, సంక్రాంతిలక్ష్మి తన జడలో ఎర్రని మందారాలను తురుముకున్నట్టు అనిపించింది. బహుశా, ఈ భూదేవి సింగారాన్ని చూసే, ఆడవాళ్ళు సింగారాన్ని నేర్చుకున్నారేమో అని అనిపించింది. ఈ రంగుల సింగారాన్నేజూసి, బహుశా, సాలెవాళ్ళుకూడా తాము నేసే బట్టలకు రంగులద్దటం నేర్చుకున్నారేమో?!  నా మనసు రైలు పరుగిడుతున్నంత వేగంకంటే వేగంగా పరుగెడుతూ, వేగంగా వెనక్కివెళ్ళిపోతున్న నేలను, ఆ ప్రకృతి పరిసరాలను చూసేస్తున్నది. ఆశ్చర్యం!! పగటిపూట నక్షత్రాలు. అదికూడా నేలమీద!! మిలమిలా మెరిసిపోతున్నాయి. ఆశ్చర్యం, అనుమానంతో ఒక్కసారి ఆకాశంలోకి తొంగిచూసా రైలు కిటికీనుంచి. ఆకాశం వెల,వెలబోతున్నది. పైనుండే నక్షత్రాలన్నీ సంక్రాంతిలక్ష్మిని దగ్గరనుండి చూడటానికే అన్నట్లు భూమ్మీదకు వచ్చేసాయి. ప్రకృతి గొప్పతనం!  నేలమీద నక్షత్రాలేమిటి అని మీరుకూడా ఆశ్చర్యపోతున్నారుకదూ! నిజమే. పత్తిచేలు. ఆకులు చాలావరకు రాలిపోయివున్నాయి. కాన్పుకు సిద్ధంగావున్న స్త్రీ ఎట్లా వడబడిపోయివుంటుందో, పత్తిమొక్కలుకూడా అట్లాగావున్నాయి. అయితేనేమి, పుట్టబోయే బిడ్డని తలుచుకుంటే ఆమె కళ్ళళ్ళో కాంతులు. పొట్ట విప్పుకొని, తెల్లగా పండిన పత్తికూడా అట్లాగే వెలుగులు జిమ్ముతూ, నేలకు దిగిన నక్షత్రాల్లా కనిపిస్తున్నది. పొలాల మధ్య, చిన్న,చిన్న పిల్ల కాలువల్లో, గల,గలమంటూ ప్రవహిస్తూన్న నీటి శబ్దం, సంక్రాంతిలక్ష్మి చేతికి వేసుకున్న గాజుల శబ్దంలా వినిపిస్తున్నది. పైరగాలి శబ్దం, ఆ సంక్రాంతిలక్ష్మి మానవాళికి, సమస్త జీవకోటికి శుభం పలుకుతూ పాడుతున్న పాటలాగావుంది. మరొకసారి నా ఒళ్ళు జలదరించింది. మరొక్కసారి ఆమెను నిశితంగా చూసాను. పండిన పసుపుతోట మొక్కల ఆకులు, పసుపచ్చని రంగులో మెరుస్తూ, సంక్రాంతిలక్ష్మి కాళ్ళకు రాసుకున్న పసుపు పారాణిలా కనువిందుచేస్తున్నాయి. మరి ఆమె కళ్ళు? ” నా కనులె  మీ కనులగా చేసుకొని”  చూడమని చెపుతున్నట్లుగా అనిపించటంలేదా ఈ శోభనంతటనీ చూస్తుంటే!! అక్కడక్కడా వున్న మోదుగ చెట్ల పువ్వుల ఎర్రని ముఖాలు ముడుచుకుపోయి వున్నాయి. ప్రక్కనేవున్న తాటిచెట్లు అడిగాయట ఎందుకట్లా వున్నారని? మేమందరం ఒక పెద్ద వడ్ఢాణంగా తయారయి, సంక్రాంతిలక్ష్మిని నడుముకు అలంకరించుకోమని అడిగాం. ఆమె సరేఆన్నది. కానీ ఏం లాభం? ఆమె నడుముకు  మేం సరిపోవటంలేదు. ఏం చేయాలి? అందుకే అట్లా వున్నామని సమాధానం చెప్పాయిట ఆ పూలు. అప్పుడు తాటిచెట్లు వాటిని బుజ్జగించి, ఆ సంక్రాంతిలక్ష్మి భూదేవి. ఎప్పుడూ నిండుచూలాలే. కాబట్టి, మీరు ఆమె నడుమును చుట్టలేరు అని ఓదార్చాయిట!!
ఇంతటి సౌభాగ్యవతి, అష్టలక్ష్మీ అయిన ఆ భూదేవి, సంక్రాంతిలక్ష్మి రూపంలో ధగ,ధగా మెరిసిపోతూంటే, కన్నుకుట్టి, ఆమె సంపదను ఎవరైనా దోచుకువెళ్తారేమో అన్న అనుమానంతో కాబోలు, నల్లటి దుస్తులు ధరించి, ఆకుపచ్చని “విచ్చు” టోపీలను పెట్టుకొని, ఆజానుభావులను తలదన్నేటట్లుగా తాటిచెట్టంత ఎత్తున్న కాపలాదారులు ఆ పొలాల గట్లంబడి పహారాకాస్తున్నారు. మీ కర్ధమయేవుంటుంది. అవి తాటిచెట్లే మరి! అయినా, మన బుద్ధి సరైంది కాదుకాబట్టే, మనకు అన్నీ అనుమానాలే! తనే, తనలోని సంపదను మనందరికీ పంచిఇస్తుంటే, ఇంకా ఆమెను దోచుకునేవారెవరు?!  ఆమే సంక్రాంతి లక్ష్మి. ఆమె  శోభే  సంక్రాంతి  శోభ!
ఇంతకీ, “సంక్రాంతి”  అంటే అర్ధం ఏమిటి? “సం+క్రాంతి”.  “సం”  అంటే మంచి, చక్కటి అని అర్ధం.  “క్రాంతి” అంటే, “క్రమణము” అని అర్ధం.  “క్రమణము” అంటే  “అడుగిడుట లేదా  నడుచుకొనుట”  అని అర్ధం. కాబట్టి, సంక్రాంతి అంటే  మంచి, చక్కటి జీవనపధంలో అడుగుపెట్టి, నడుచుకోవాలి అని అర్ధం. మరి మనందరి సంకల్పాలుకూడా అదే కావాలని కోరుకుంటూ,  శెలవ్.  స్వస్తి.
“ ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది ”
‘ప్రజాస్వామ్యం’ అంటే ఏమిటి? వేదికపైనున్న పెద్దలొకరు సభలోవున్న యువతను అడిగారు. ఒకతను లేచి, పాఠాల్లో చదువుకున్నదాన్ని, ప్రజలకోసం, ప్రజలచేత …. అంటూ సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ప్రభుత్వం సమాంతరమైన రైలు పట్టాలులాగా ముందుకు సాగుతుంటాయి అంటూ ముగించాడు తన సమాధానాన్ని. మరొక యువకుడు లేచి నిర్వచినం చెప్పాడు. అతనికి అందరూ బాగా చప్పట్లు కొట్టారు. ఇతను భవిష్యత్‍లో గొప్ప రాజకీయ నాయకుడవుతాడు అని జోష్యం చెప్పారు. ఇంతకీ అతను చెప్పిందేమిటంటే:- ప్రజాస్వామ్యంలో ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుంది; ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి‘నిధులు’ ప్రభుత్వాన్ని నడుపుతారు; ప్రజలనుంచి నిధులను పన్ను రూపంలో సేకరించి, తిరిగి వాటిని ప్రజోపకరమైన పనులకోసం ఖర్చు చేస్తారు; అంటే, ప్రజలనుంచి వచ్చిన సొమ్ము, తిరిగి, ప్రజలవద్దకే వెళతాయి; వెళ్ళాలికూడా. ( మనలోమాట! :- ప్రజలనుంచి వసూలుచేసిన పన్నులో సింహభాగం బీద,బిక్కి, నిరుపేదలకు చేరుతుంది; వారిపేరుతో పధకాలను సృష్టించి, నిధులను (దుర్)వినియోగం చేసి, సింహభాగంలో  సింహభాగం ప్రజాప్రతినిధులు తమ జేబు నింపుకుంటారు;  ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం అని మనమేకదా చెప్పుకున్నాం! పేదవారి కోపం పెదవికి చేటన్నరు ప్రజాప్రతినిధులు; అందుకే పేదలు పెదవి విప్పలేరు. ఇక, నిధుల్లో మరొక సింహ భాగం బాగా ధనవంతుల వర్గానికి అందుతాయి; మరి వారేకదండీ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేది! వీరుకూడా పెదవి విప్పరు, పైగా పెదవిపై వేలు వేసుకొని వుంటారు. ఎవరైనా సభలో చూస్తే, చూసారా, అంత పెద్దవాడైనా (డబ్బునవాడైనా), ఎంతో వినయంతో నోటిమీద వేలు వేసుకుని మరీ కూర్చున్నాడు బుద్ధిమంతుడులాగా అని వారికే కితాబు ఇస్తారు. ఇక మిగిలింది మధ్యతరగతివారు. వీరి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క లాంటిది. ఇంతకంటే వివరంగా చెప్పనక్కరలేదనుకుంటా! ).  … ఆ విధంగా అతను సమాధనమిస్తూ, ఇంకా ఏమన్నాడంటే, మరి ప్రజల సొమ్ము, ప్రజలవద్దకే చేరాలంటే, ప్రజాస్వామ్యాన్ని రైలుపట్టాలతో పోల్చకూడదు; పట్టాలు ఎంత దూరం అయినా కలవవు; ప్రజలు, ప్రజల సొమ్ముకూడా ఎప్పుడూ, లేదా భాగస్వామ్యం పొందవు. కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని ఒక గుండ్రంగా గీసిన గీతగా అభివర్ణించాలి. ఒక బిందువునుంచి గీత గీసినా, అది చివరకు ఆ బిందువులో కలిసిపోయి, తుది,మొదలు తెలియవు; అదేవిధంగా, ప్రజలు, పన్నులు, ప్రజాప్రతినిధులు ఈ గుండ్రంగా గీయపడిన గీతలాంటివారు; పన్నులరూపంలో సొమ్ము ప్రజలనుంచి విడివడి, ప్రజాప్రతినిధులకు చేరి, తిరిగి (తమ)ప్రజలవద్దకే చేరుకుంటాయి. ఇదే ప్రజాస్వామ్యంలో అసలైన, సిసలైన ప్రజాభాగస్వామ్యం’ అంటూ తన ఉపన్యాసాన్ని ముగించాడు.
పై ఉ(దుర్)ద్బోధనని ఎంతోమంది ‘గీతోపదేశం’గా భావించి, నేటి తాజా రాజకీయాల్లో అమలుపరుస్తున్నారు. అందులోంచి పుట్టుకొచ్చిన పధకమే ‘బీ.ఓ.టి.’ (Build, Operate, and Transfer). అందరికీ తెలిసిందైనా, సూక్ష్మంలో చెప్పాలంటే, ఒక జాతీయ రహదారో; ఒక జాతీయ నీటి ఆనకట్టనో నిర్మాణం చేయాలనుకోండి; ప్రభుత్వం, ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది. మీ స్వంత డబ్బులతో రోడ్డుని నిర్మించండి; దానికయిన ఖర్చు ( ప్రజాప్రతినిధులకిచ్చే విరాళంతో సహా కలిపి! ), పెట్టుబడిపై వడ్డీ ఖర్చు, మీకు కొంత స్వంత వ్యాపార లాభం అన్నింటినీ కలిపి, ఆ మొత్తాన్ని ఒక పాతిక సంవత్సరాలలో, కొంచెం,కొంచెంగా, ప్రజలనుండి ‘టోల్‍టాక్స్’ రూపంలో వసూలు చేసుకోండి; పాతిక సంవత్సరాల తరువాత ఆ రోడ్డు, దాని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వానికి అప్పచెప్పండి. ఇది టూకీగా బీ.ఓ.టి. అంటే.
అన్నట్లు, ఇక్కడ మీకొక తమాషా విషయం చెప్పాలి. మనిషి చనిపోయిన తరువాత, అతనిని ఇంటి దగ్గరనుంచి, శ్మశానానికి తీసుకువెళ్ళే దోవలో, ఐదుసార్లు పాడెను క్రిందకు దించి, మళ్ళీ ఎత్తుకొని ముందుకు తీసుకువెళ్తుంటారు. అతడు చనిపోయాడని భ్రమపడ్డామేమో! అతను మళ్ళీ లేస్తాడేమో! అనే ఒక ఆశతో! బీ.ఓ.టి. పద్దతిలో నిర్మించిన రహదారిపై వాహనదారులనుకూడా ఐదారుచోట్ల ఇదేవిధంగా ఆపుతుంటారు. మొదటి గేటు దగ్గర పన్ను కట్టకుండా తప్పించుకున్నా, రెండో గేటు దగ్గర వసూలుచేస్తారు; అట్లా ఆఖరు గేటువరకు చెక్ పెడుతూనే (చేస్తూనే) వుంటారు. ఇందులో ఒక గొప్ప మర్మంవుంది. ఈ రహదారిపై, ముందుకు వెళ్ళటానికి, తిరుగు ప్రయాణానికి కలిపి టికెట్టు తీసుకుంటే వాహనదారుడికి కొంత పన్ను భారం తగ్గుతుంది, కానీ, గుత్తేదారుడికి కొంత నష్టం. అదే ముందుకు వెళ్ళటానికి మాత్రమే టికెట్టు తీసుకుంటే వాహనదారుడికి పన్ను భారం ఎక్కువ; గుత్తేదారునికి లాభం. ఐదు గేట్ల దగ్గరకూడా ఎందుకు చెక్ చేస్తారంటే వాహనదారుడు, తన ప్రయాణంలో ఒక జాతీయ రహదారినుంచి మరొక రహదారిపైగా ప్రయాణిస్తుంటాడు. ప్రతి రహదారిపైనా టోల్‍టాక్స్ కట్టాల్సిందే! ఈ టోల్‍టాక్స్ దెబ్బలకు ప్రయాణికుడు ఠపీమంటాడా? లేక బట్టగట్టి ముందుకు వెళ్ళే పరిస్థితిలో వున్నాడా? అని చెకు చేసుకోవటానికే!!
“ ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది!! ”. ఇది ఒక సెల్‍ఫోన్ కంపెనీవారి వాణిజ్య ప్రకటన. ఇందులో చాలా దూరాలోచనవుంది. ఒక మంచి ఆలోచన రావాలేకానీ, జీవితమనే బండిని బ్రతుకు అనే బాటపై ఎడాపెడా మనం నడిపించేయవచ్చు సుమండీ! ఇదే ఆలోచన ఆధారంగా, ఈ మధ్యనే, నేటి దేశ,కాల,మాన,పరిస్థితులను బట్టి ఒక యువ రాజకీయ నాయకుడుకి ఒక సరికొత్త ఆలోచన మెదడులో మెరిసింది. అదేంటో చూద్దామా!!
అది ఆసియా ఖండం; అందులో భారతదేశం; అందులో దక్షిణ భారతదేశం; అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ( గమనిక: ఈ రాష్ట్రానికి పశ్చమాన, అంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దు – ఆ సరిహద్దు, ప్రజాస్వామ్యంలో, ప్రజాభాగస్వామ్యంలో, కొంతమేర చెరిగిపోయింది! )
మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య దేశంలో ఆర్ధిక నేరాలు ఎక్కువై, పెద్ద,పెద్ద (రాజకీయ) నాయకులు చట్టానికి చిక్కిపోతున్నారు. ప్రభుత్వం చాలా చురుకుగా పనిచేస్తున్నది అనటానికి నిదర్శనం సీ.బి.ఐ. అనేకమంది నాయకులని అరెస్ట్‍చేసి, కారాగారాల్లో నెలలతరబడి వుంచుతున్నది. నాయకులతోపాటు ఉన్నతాధికారులుకూడా జైల్లోకి వెళుతున్నారు. జైలుకు వెళ్ళుతున్న ప్రతి నాయకుడు, అధికారి పెద్ద హోదాతో, పలుకుబడి వున్నవారు; విలాసవంతమైన జీవితం గడిపేవారే! ఇందులో ఆశ్చర్య పోవలిసినదేమీలేదు. ఇక్కడే కధలో మలుపు, మెరుపు. ఈ పెద్ద,పెద్ద నాయకులు, అధికార్లందరూ, జైలు శిక్ష పడిన తరువాత, న్యాయమూర్తిముందు, తాము పెద్దవాళ్ళం (వయసులో కాదు) కాబట్టి, ప్రభుత్వాన్ని పరోక్షంగా, ప్రత్యక్షంగా నడపటంలో ‘భాగస్వామ్యం’ వున్నవాళ్ళంకాబట్టి, జైల్లోకూడా తమను ‘ప్రత్యేక హోదా’గల వ్యక్తులుగా గుర్తించి, మొదటి తరగతి వసతులను కల్పించవలసినదిగా కోరుతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అని పెద్దలన్నారు. అసలే మన కారాగారాలు ఆంగ్లేయులు కాలంనాటివి. వసతులు తక్కువ. అందరికి ప్రత్యేక వసతులున్న గదులను కేటాయించాలంటే జైలు అధికారులకు కష్టంగానే వున్నది. ఒకరిని ఒకరకంగా, మరొకరిని ఇంకొక రకంగా ‘ట్రీట్‍మెంట్’  చేస్తే రేప్రొద్దున ఎటొచ్చి ఏమవుతుందో? “ నేటి జైల్లోవున్న నాయిక-ఖైదీనే,  రేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి ” కూడా కావొచ్చునేమోకదా!! అందుకని, వారి భయం వారిది. అట్లాఅని, అందరికీ కోరుకున్న వసతులు కల్పించలేరు మరి!
మొదట్లో ఒక యువకుడు ప్రజాస్వామ్యం గురించి చెప్పిన విషయాలు గుర్తున్నాయికదా? ఆ యువకుడే వ్యాపారాలు చేస్తూ, రాజకీయాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాడు. అతనికి వచ్చిన ఒక గొప్ప ఆలోచనే ఈ క్రొత్త పథకం:– ‘ బీ.ఓ.టి. ’ పద్ధతిన రాష్ట్రంలోనూ, దేశం మొత్తంమీదానూ కారాగారాలు కట్టించి, అందులో ( మూడునుంచి ఐదు నక్షత్రాల, వద్దులేండి, ఇదీ మరీ వినటానికి, చూటానికి బాగుండదు ప్రజాస్వామ్యంలో!! )  ఒకటి నుంచి మూడు నక్షత్రాల హోదా, వసతులుగల గదులను నిర్మించటం; 14 సంవత్సరాల తరువాత (జీవితఖైదుకాలం) వీటిని బీ.ఓ.టి. పద్ధతిలో ప్రభుత్వానికి అప్పగించటం ”.
పెద్ద,పెద్ద రహదారులు, నీటి ఆనకట్టలు, విద్యుత్ కేంద్రాలు, హోటళ్ళు, సూపర్ బజార్లులాంటివి కట్టటానికి ఎవరైనా ముందుకు వస్తారుగానీ, కారాగారాలను బీ.ఓ.టి. పద్ధతిన కట్టటానికి ఎవరు ముందుకు వస్తారు? ఇది పెద్ద సమస్యే!  కానేకాదు. తమ వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు హద్దులు హద్దులేకావు, ఆకాశమే హద్దు అనేవాళ్ళు;  శబ్ద తరంగాలకు హద్దేమిటి? సహజసిద్ధమైన వాటిని అందరికీ పంచితే తప్పేమిటి? అనే వాళ్ళకు;  లక్ష్మి చంచలమైంది, నీదగ్గర వున్న ధనం, ఏదోవిధంగా నాదగ్గరకువస్తే తప్పేమిటి? అన్నిట్లో ప్రజాభాగస్వామ్యం కనబడటంలేదా? అనేవాళ్ళకు;  ప్రజలకోసం ప్రభుత్వం వున్నప్పుడు, ప్రజల పనులను వారికి ఇష్టమైన పద్ధతిలో చేసిపెట్టటంలో తప్పేమిటి? భయందేనికి అనేవాళ్ళకు  ఇది సమస్యేకాదు!  ఏదో ప్రజలు అపోహపడి, ఆర్ధిక నేరాలు చేసారని అభియోగం వేసినంత మాత్రాన అది తప్పు అయిపోలేదుకదా? ఋజువు కావాలికదా? అప్పటివరకూ, జైల్లో ప్రత్యేక వసతులులేని సెల్లో, సెల్ (సెల్ ఫోన్) కూడా లేకుండా ఎట్లాగడపాలి? అందుకనే, ఈ పై వర్గం వారందరూ కలిసి, ఒక బృందంగా (కన్‍సార్టియం) ఏర్పడి,  బీ.ఓ.టి. పద్ధతిలో కారాగారాలు కట్టించటానికి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారుట!! ప్రజాస్వామ్యంలో  భాగస్వామ్యం!   ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది!!
“ విడాకులు ”
భారతదేశంలో వివాహ వ్యవస్థ సమసమాజానికి, సంస్కృత సమాజానికి పునాదిలాంటిది. చక్కటి, ఆదర్శవంతమైన వివాహా జీవితం గడుపుతూ, భావిభారతాన్ని చక్కదిద్దే సంతానాన్ని అందించేదే మన వివాహవ్యవస్థ. వివాహ సమయంలో నవ వధూవరులు  లక్ష్మీ,నారాయణులు;  వివాహమనంతరం వారిరువురూ  అర్ధనారీశ్వరులు. భారతావనిలో ఏ వివాహిత స్త్రీ, భర్తనుంచి విడాకులు కోరుకోదు. ఒకవేళ కోరుకుందంటే, ప్రధాన లోపం భర్తనుండే వుండివుండాలి. విడాకులు కోరుకోకపోవటానికి కారణం – మన పురాణాల ప్రభావమే ; మన ధర్మశాస్త్రాల ప్రభావం; మన సంస్కృతి, ఆచారవ్యవహారాల ప్రభావం. ఒక పురుషునిని మనఃస్పూర్తిగా భర్తగా స్వీకరించిన స్త్రీ, మరొకరిని స్వీకరించలేదు. అందువలనే మన వివాహవ్యవస్థ స్థిరంగా వుంటూవచ్చింది. అయితే, చాలా చిన్న వయస్సులోకానీ, నిరాధారమైన జీవనాన్ని సాగించవలసివచ్చినప్పుడు, తప్పనిసరి పరిస్థితులలో, స్త్రీ మారు వివాహానికి ఒప్పుకుంటుంది. భర్త చనిపోయినా, లేదా విడిపోయినా, తన పిల్లలకు ఆసరాగావుంటూ, వారిని ప్రయోజకులుగాచేసి, సమాజానికి అందింస్తుంది స్త్రీ. ఇది భారతదేశ స్త్రీ గొప్పతనం; ఔదార్యం.
ధర్మ, అర్ధ, కామ, మోక్షమనే నాలుగు ధర్మాలకు మన వేదశాస్త్రాలు సమానహోదాను కల్పించి, వాటిని పాటించటంలో ఎక్కువ, తక్కువలు చూపకూడదని ఉద్భోదించాయి. ఈ నాలుగు ధర్మాల్లో, ఏ ఒక్క ధర్మానికిఅయినా అధిక ప్రాధాన్యం ఇస్తే, హిందూ వివాహవ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఈ నాలుగు ధర్మాల్లో  అర్ధానికి, కామానికి; లేదా రెండిటికీ మాత్రమే ఎక్కువ ప్రధాన్యం ఇవ్వటంవలననే అనేక దేశాల్లో వివాహవ్యవస్థ ఛిన్నాభిన్నమవుతుంటాన్ని మనం గమనిస్తున్నాం. విడాకుల  వ్యవహారాల్లో మన సమాజంలో పురుషులు ముందుగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కారణం, నైతిక విలువలను మరవటం; పైన చెప్పిన నాలుగు ధర్మాలను పాటించకపోవటం. ప్రతి వ్యవహారంలోనూ, ముఖ్యంగా చిక్కు వ్యవహారాల్లో,  స్త్రీ  ఎక్కువుగా సర్దుకుపోతూ, సమస్యకు పరిష్కారం వెదుకుతుంది; కానీ, పురుషుడు సర్దుకుపోవటానికి ముందుకు రాకపోవటంతో విడాకుల సమస్యలు పెరుగుతాయి.
భార్యా,భర్తలు – ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు; మంచి ఉద్యోగాలు కలిగివున్నారు; సంపాదన బాగావున్నది. తను ఊహించుకున్న, కోరుకున్న పద్దతిలో భర్త, భార్యనుగానీ;  భార్య, భర్తనుగానీ చూడటంలేదు కాబట్టి, ఆలుమగలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు పాశ్చాత్యదేశాల్లో. పైన చెప్పిన నాలుగు ధర్మాల్లో, ఆర్ధిక, కామమనే రెండింటికి మాత్రమే అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే ఇట్లా జరుగుతున్నది. మళ్ళీ వివాహం చేసుకుంటే, వచ్చే భర్తగానీ,  భార్యగానీ తాము కోరుకున్నట్లుగానే వుంటారు అనేదానికి అవకాశంవుందా? ఉండకపోతే, మళ్ళీ విడాకులు తీసుకోవటం పరిపాటిఅయింది. ఈలోపల వీరికి కలిగిన సంతానం మాటేమిటి? వారిపై ఈ విడాకుల ప్రభావం తీవ్రంగా వుంటుంది. నిరంతర, నిర్మలమైన తల్లి,తండ్రుల ప్రేమ వారికి కరువవుతుంది. దీని పర్యవసానం సమాజంపై పడుతుంది. ఇప్పుడిప్పుడే మన దేశంలోకూడా ఇటువంటి పోకడలు పెరుగుతున్నాయి.
మన దేశంలో నాడు, నేడుకూడా స్త్రీ, భర్తనుంచి విడాకులు కోరుకునేది చాలా తక్కువ. కారణం ఏమిటి?  “ వివాహవ్యవస్థలో, చెప్పాలంటే, ఏ దేశ వివాహవ్యవస్థలోనైనా, భార్యా,భర్తల మధ్య, ప్రథానంగా వుండాల్సింది  పరస్పర నమ్మకం.  నమ్మకం వున్నచోట భయం, అబధ్రతలకు తావులేదు;  ఒకరిపై మరొకరికి నమ్మకం వున్నప్పుడు, అక్కడ ప్రేమ చిగురిస్తుంది;  ఆ ప్రేమ అనురాగానికి ఆరోహణ మెట్టుగా మలచబడుతుంది;  అనురాగం మొలచిన చోట కలుపుమొక్కలు పెరగవు;  అను‘రాగమతిశయించిన’ చోట నిర్మలమైన ప్రేమరాజ్యం ఒక్కటే వుంటుంది;  ఆ రాజ్యానికి భార్యా,భర్తలు రాజు,రాణీలు;  రాజు,రాణి తాము ధర్మాన్ని పాటిస్తూ, ఇతరులుకూడా ధర్మాన్ని పాటించేటట్లుగా చూడాలేకానీ, తామే ధర్మాన్ని తప్పకూడదు;  ఈ కట్టుబాటునే, వివాహవ్యవస్థకి బాటగా మలచి, మన పెద్దలు ఎన్నో ఉదాహరణలను కథలరూపంలో చెప్పారు.  ఆ కథలను అమ్మ పొట్టలోపలే ఉన్నప్పుడు విన్న భారత స్త్రీ, తన మానసంలో, పుట్టుకతోనే ఈ గుణాలను పుణికిపుచ్చుకొని ఈ లోకంలోకి వస్తుంది. ఈ లక్షణం భారత స్త్రీలకు కర్ణుడి కవచకుండలంలాంటిది. పుట్టుకతో వచ్చింది, పుడకలతోనే పోతుంది అనే సామెత మనకివుంది. ఇది అక్షరాలా నిజం. ఇది పురుషులకుకూడా వర్తిస్తుంది.
‘ వివాహం ’  అంటే అర్ధం, ‘ విశేషమైన సమర్పణ ’ అని. అంటే, కన్యాదాత, తన కూతురుని, ఒక ప్రత్యేక, సామాజిక కార్యనిర్వహణకోసం, వరునికి సమర్పిస్తాడు. వివాహం,  వేడుక లేక ఉత్సవంకాదు. ఇది ఒక మహత్తర సంస్కారం. కేవలం తన కామపరితృప్తికోసం, పురుషుడు, ఆహూతులైన పురప్రజల సమక్షంలో, వారి ఆమోదంతో, స్త్రీని గ్రహించినట్లైతే, ఆ కార్యాన్ని ‘ భోగం ’ అని అంటారేకానీ, వివాహమనరు. ఒక పుత్రుని కనటంద్వారా తండ్రి, మరణానంతరం, పున్నామి నరకంనుంచి రక్షింపబడతాడు; అయితే, ఒక తండ్రి, తన కూతురుని, ఒక వరునికిచ్చి వివాహం చేయటంద్వారా, తన వెనుక, ముందు పది తరాలవారు ఉద్ధరింపబడతారు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ ధర్మంలో పురుషుడు స్వకార్యం కోసమైనా, ప్రజోపకారం కోసమైనా ఏదైనా యజ్ఞ్న,యాగాదులు చేయాలంటే, ఒక ప్రత్యేక అర్హత కలిగివుండాలి. అదే స్త్రీని వివాహమాడివుండటం.  స్త్రీ, వివాహం చేసుకోవటంద్వారా తన తల్లి,తండ్రులకు ఆనందం కలిగించటమేకాకుండా, తన భర్తద్వారా పుత్రసంతానాన్ని, స్త్రీ సంతానాన్ని పొంది, అత్త,మామలవారి కుటుంబానికికూడా ఆనందం, అభివృద్ధిని కలిగిస్తుంది. ఇంతటి మహోన్నతమైన సంకల్పంతో, సామాజిక స్పృహతో, నైతిక విలువలతో, ఒక భారత స్త్రీ, ఒక పురుషుడిని వివాహమాడుతుంది కాబట్టే, ఆ స్త్రీ తన భర్తనుంచి విడాకులు పొందటానికి సమ్మతించదు.
|| ధర్మార్ధ కామేషు త్వయైషా నాతి చరితవ్యా|| :ధర్మ, అర్ధ, కామముల విషయంలో భార్యను అతిక్రమించి ప్రవర్తించకు  అని కన్యాదాత, వరునికి ఉద్భోదిస్తే, వరుడు, ‘నాతి చరామి’ : ఆ విధంగా ప్రవర్తించను  అని ప్రమాణం చేస్తాడు. భార్యా,భర్తలలో ఏ ఒక్కరు పొరపాట్లుచేసినా, వాటిని ఎదుటివారు అర్ధంచేసుకొని, సర్దుకొని, దిద్దుబాటు చేసుకొని, ఆ తప్పులు మరలా జరగకుండా చూసుకుంటూ, వివాహ జీవితాన్ని గడపాలేకానీ, విడాకులు తీసుకొని, తమ సమస్య పరిష్కారం అయిందని అపోహపడి, కొత్త ఆనందానికి దారులు వెతకకూడదు. పురుషుడు ఈ విషయాన్ని అర్ధంచేసుకొని, ధర్మ నియమాన్ని పాటిస్తే, విడాకుల సమస్య ఉత్పన్నమేకాదు.   స్వస్తి.
|| వ్రేల్లు నాటుకున్న చెట్టు, భూమాతను విడిరాలేనంది;
కడలి అలలు, చెలియకట్టను దాటలేనంది;
నదీప్రవాహం సాగరుడిని కలవకుండా వుండలేనన్నది;
చేప, నీటిని త్యజించలేనన్నది;
కనురెప్ప, కంటిని వదలలేనన్నది;
వేదశాస్త్రాలు పెళ్ళి తాంబూలాలున్నవేతప్ప, విడాకులు లేవన్నవి;
భారతావని,
లక్ష్మీ,నారాయణుల (ఆలు,మగల); శివపార్వతుల భారతమేతప్ప,
విడాకుల భారతం లేదన్నది,  తప్పన్నది ||
“ పునరపి జననం :: పునరపి మరణం ”
ముందుమాట:   ఈవ్యాసంలో నేను రెండు ఊహాజనితమైన విషయాలను ప్రతిపాదించాను. అవి ఋజుపరిశీలనలో నిలబడవచ్చును లేదా నిలబడకపోవచ్చును. చదువరులు తమ,తమ అభిప్రాయలను తెలియచేయవచ్చును.
భగవద్గీత రెండవ అధ్యాయం, ఇరవైఏడువ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్పాడు:
|| జాతస్య హి ధ్రువోమృత్యు ర్ధృవం జన్మ మృతస్య చ | తస్మాదపరిహార్యేర్ధే | న త్వం శోచితు మర్హసి ||
అర్ధం:  పుట్టినవానికి చావు తప్పదు;  చచ్చిన వానికి పుట్టుక తప్పదు.
పై శ్లోకాన్నిబట్టి ఈ విశ్వంలో శాశ్వతమైనది ఏదీలేదు;  అట్లని అశాశ్వతమైనదీ ఏదీలేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని జీవులకు, వస్తువులు లేదా పదార్ధాలకి అన్వయిస్తే, ఈ రోజు పుట్టిన జీవి, రేపు చనిపోతే, ఆతరువాత ఆ జీవి మరల పుడుతున్నాడని తెలుస్తుంది. మరణానికి, మరల పుట్టుకకి మధ్యవున్న ‘సంధికాలం’ మనకు కనబడటంలేదు/తెలియటంలేదు. పదార్ధ విషయంలోకూడా ఇంతే. కానీ, ఆ జీవి లేదా ఆ పదార్ధం, అవసరమైన మార్పులుచెంది మరల సృష్టిపధంలో తిరుగాడుతూనేవుంటుంది.
శక్తి-ఉష్ణం-కాంతి:  ఒక జీవపదార్ధం, కొంత ఒరిపిడికి లోనైనప్పుడు, దానినుండి శక్తి, ఉష్ణం, కాంతి ఏర్పడుతుంటాయి. ఈ ప్రక్రియలో, ఈ మూడింటిలో ఒకటి, లేదా రెండు కంటికి కనిపించవచ్చు, లేదా కనిపించక పోవచ్చును. కానీ, మూడూ ఆవిష్కరింపబడుతూనేవుంటాయి. అయితే, విత్తుముందా? చెట్టుముందా? అన్నట్లుగా,  జీవపదార్ధం ముందా? లేక శక్తి ముందా? అని ప్రశ్నించుకుంటే, నా ఉద్దేశ్యంలో ‘శక్తి’ అనేదే ముందు అని అంటాను. ఈ శక్తినే ‘ విశ్వ చైతన్యశక్తి’ అని అందాం. శక్తే ముందు అని ఎట్లా చెప్పొచ్చు అని అంటే, ఆధునిక శాస్త్రాల ప్రకారంకూడా, ENERGY IS NEITHER BE CREATED NOR
/*DESTROYED ( శక్తికి పుట్టుక, నాశనము లేవు ) అని చెప్పబడింది కాబట్టి. అంటే, పదార్ధం శక్తి తరువాతనే పుట్టివుండాలి, లేదా శక్తినుండి పుట్టివుండాలి. మన వేదశాస్త్రముల ప్రకారంకూడా ఈ విశ్వమంతా చైతన్యశక్తియొక్క సృష్టే!!  ‘E=Mc2’ అనే సిద్ధాంతాన్నికూడా ఇక్కడ, ఈ ప్రతిపాదన సరిఅయినదే అని చెప్పటానికి వినియోగించవచ్చు. E లేదా శక్తి – దీనినే ముందుగా ఎందుకు చెప్పాలి? పదార్ధాన్ని ముందుగా చెప్పవచ్చునుకదా? అని ప్రశ్నిస్తే, పదార్ధం కంటికి కనిపించినా, కనిపించకపోయినా,  శక్తి  అనేది శాశ్వతంగా వుంటుంది; తెలుస్తుంది కాబట్టి అని చెప్పవచ్చు. మరొక మాటేమిటంటే, ‘ENERGY CAN BE EXCHANGED IN THE FORM OF HEAT OR MECHANICAL WORK, BUT ENERGY’S TOTAL QUANTITY REMAINS CONSTANT’( స్థిరః – విష్ణుసహస్రనామం). ఈ వాక్యం ద్వారాకూడా చైతన్యశక్తి యొక్క ప్రాధమ్యం, ప్రాముఖ్యత మనకు తెలుస్తున్నది. మరొక ఉదాహరణను చూస్తే:- ELECTROMAGNETIC ENERGY IS PERPETUALLY CHANGING FROM ENERGY TO MASS AND FROM MASS TO ENERGY అని చెప్పబడింది.
చైతన్యశక్తి తనకుతానుగా అనేక రూపాలుగా మారుతున్నప్పుడు, దానినుండి పుట్టిన ఏ ఇతర జీవ పదార్ధాలకైనా  పుట్టుక, ఎదుగుదల, తగ్గిపోవటం, నశించిపోవటం  అనే నాలుగు దశలు కనిపించినా, నిజానికి ఆ స్థితులన్నీ పరిణామ దశలే. అంటే చైతన్యశక్తి ఒక  భ్రమణ-చక్రంలాంటిది అని తెలుస్తున్నది. దీనికి, దీనిలోవుండే పదార్ధానికి  ఆది, అంత్యం  అనేవిలేవు. మన వేదశాస్త్రాల ప్రకారం జీవులు 64 వేల కోట్ల యోనుల ( MOTHER’S WOMB ) ద్వారా జీవ, మరణ దశలను పొందుతారు అని చెప్పబడింది. ప్రతి జీవికికూడా ఒక పరిణామ దశవుంది అని చెబుతూ, జీవులన్నింటినీ సృష్టించే బ్రహ్మకుకూడా  నూరు సంవత్సరాల ( బ్రహ్మకు: 360 రోజులు ఒక సంవత్సరం; 100 సం.లు=309173760000000  అంటే మూడు కోట్ల, తొమ్మిది లక్షల, పదిహేడువేల మూడువందల డెబ్భైఆరు కోట్ల కోట్ల సంవత్సరాలు ) ఆయుఃప్రమాణాన్ని చెప్పబడింది. కాబట్టి, చావు,పుట్టుక అనేవి ఒకదానికొకటి సంధింపబడివున్న నిరంతర ప్రక్రియలని చెప్పవచ్చు.
నీరు పల్లమెరుగు, నిజము దేవుడెరుగు అని సామెత చెబుతారు. నీరు పల్లానికే ఎందుకు వెళ్తుంది? ఎందుకంటే, నీరు ఎత్తులో వున్నదికాబట్టి. మరి ఆ నీటిని అంత ఎత్తులో మొదటగా వుంచెందెవరు? దేవుడా? అయితే, ఆ నిజంకూడా ఆ దేవుడికే తెలియాలి! అసలు సంగతేమిటంటే, నీరు కణ సముదాయం; తనలో ఇమిడివున్న చైతన్యశక్తిచే, ఒక చోటనుంచి మరొక చోటుకు కదులుతూనే వుంటుంది. కొండల్లో పుట్టి, నదులై, సముద్రంలో కలిసి, ఆవిరై, వర్షరూపంలో మరల కొండలపై పుట్టి, మళ్ళీ పల్లానికి ప్రవహిస్తుంటుంది. అట్లాగే, ఈ విశ్వచైతన్యశక్తి, దానిద్వారా పుట్టిన అణువులు, పరమాణువులు, జీవులు నియమబద్ధంగా, కాలాతీతంగా ఈ విశ్వంలో కదులుతూనే వుంటాయి.
ప్రతిజీవి, జీవపదార్ధము లేదా జీవ పరమాణువులతో నిర్మింపబడినదే. ఈ జీవ పరమాణువులకు ఆ జీవం అనేది ఎక్కడనుంచి వస్తున్నది? విశ్వ చైతన్యశక్తినుంచే వస్తున్నది. మనం పదార్ధంలోని పరమాణువులను సూక్ష్మదర్శిని ద్వారా చూడగలముకానీ, వాటిలోవున్న చైతన్యశక్తిని చూడలేము. అయితే, ఆ శక్తిని ఉష్ణము, వెలుతురు, చలనములద్వారా తెలుసుకోగలం; అనుభవించగలం. ప్రతి జీవికి, లేదా జీవ పదార్ధానికి పుట్టుక, పెరుగుదల, తగ్గుదల, నాశనము అనే నాలుగు దశలున్నపటికీ, నాశన దశ తరువాత, ఆ జీవి లేదా జీవపదార్ధం, మరియు శక్తి ఎక్కడికి పోతున్నాయి? అనేది ముఖ్యమైన ప్రశ్న. అయితే, ఈ జీవపదార్ధం సంపూర్ణ మరణం (dead) కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
జీవపదార్ధం పరమాణువులయొక్క సముదాయం. ఉదాహరణకి:  మానవ శరీరం తీసుకుందాం. ఈ శరీరానికి మూడు స్థితులున్నాయి. కారణ శరీరం;  సూక్ష్మ శరీరం; స్థూల శరీరం. ఏదో ఒక కారణంవలన శరీరం పుట్టిందికాబట్టి కారణశరీరం అని అన్నారు;  జ్ఞానేంద్రియాలు, మనసుతోకూడి, కంటికి కనిపించక, అనుభవ జ్ఞానాన్ని కలిగివుండేది కాబట్టి సూక్ష్మశరీరం అని అన్నారు;  పంచభూతములవలన పరమాణువలతోకూడి తయారయి, కంటికి కనిపించేది కనుక స్థూలశరీరం అని అన్నారు.
ఈ పేరాలో నా ఊహాజనితమైన ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. దీనికి సమర్ధనగా ఆధునిక సైన్స్ సిద్ధాంతాల్నికూడా పరిగణలోకి తీసుకుంటున్నాను. శరీరం మరణించినప్పుడు శరీరకణజాలం విఛ్చిన్నమైపోయి, భూమిలో కలిసిపోతుంది; అక్కడ అనేక రూపాంతరాలు చెందుతుంది. అయితే, ఈ శరీకణజాలంలోని ‘చైతన్యశక్తి” ఏమయినట్లు? ఇది నాశనం అయిపోతుందా? కాదు అని సమాధానం చెప్పాలి. ఇది విశ్వచైతన్యశక్తిలో కలిసిపోతుంది; కలిసిపోవాలికూడా. ‘చైతన్యశక్తి’ని,  ‘సూక్ష్మశరీరం’ అని చెప్పవచ్చా? అవును అని అనుకుంటే, ప్రతి జీవినుండి విడివడిన చైతన్యశక్తి, విశ్వచైతన్యశక్తితో సంబంధముకలిగి వుంటూనే, తను ఒక “ప్రతిపత్తి”గా ( individualised Entity ) వుండివుంటే, అట్టి సూక్ష్మశరీరం, తనకు కలిగివున్న జ్ఞానేంద్రియశక్తితో, తిరిగి ఒక క్రొత్త శరీరంతో పునర్జన్మను పొందగలదు. ఇక్కడ, మనం పైన చెప్పుకున్న మూడు సిద్ధాంతాల్ని గుర్తుకుతెచ్చుకోవాలి: ఒకటి: Energy, neither be created nor be destroyed;  2nd: E=Mc2;  3rd: Electromagnetic energy is perpetually changing from
Energy to Mass and from Mass to Energy.
స్థూల శరీరకణజాలం, మరణం తరువాత విఛ్చిన్నమైనప్పటికీ, తిరిగి పుట్టటం జరగాలంటే, సూక్ష్మశరీరం, తనలోని చైతన్యశక్తిని, సంపూర్ణ చైతన్యశక్తి స్థాయికి తెచ్చుకోవాలి. దీనిని ఆంగ్లంలో ‘ రెజ్యువినేషన్ ’ (rejuvenation) అని అంటారు. మరి, ఆవిధంగా సూక్ష్మశరీరం పరిణామం చెందుతుందా? చెందగలదా? అని అంటే, ఇక్కడకూడా నాయొక్క ఊహాజనితమైన ఒక ప్రతిపాదనని, ఆధునిక సైన్స్ విషయాధారంగా మీముందుకు తీసుకువస్తున్నాను:-
ఆధునిక సైన్స్‍లో ‘బ్లాక్‍హోల్స్’ (కృష్ణబిలాలు) ను గురించి వివరించటం జరిగింది. విశ్వంలోని గ్రహాలన్నీ పెద్ద,పెద్ద నక్షత్రాలు విస్పోటం చెందటంవలన ఏర్పడ్డాయని చెప్పటం జరిగింది. ఇటువంటి పెద్ద,పెద్ద నక్షత్రాలు అంతులేకుండా ఈ విశ్వంలో వున్నాయి. ఇటువంటి నక్షత్రాలు, ఒక దశ అంతంలో కూలిపోయినప్పుడు, వాటిలోని ఘన, ద్రవ, వాయి,ధూళి పదార్ధాలు ఒకచోట కుప్పగా ఏర్పడతాయి. ఈ కుప్పగావుండే ప్రదేశాన్నే బ్లాక్‍హోల్ లేదా కృష్ణబిలము అనిఅంటారు. ఈ ప్రదేశంలో, పదార్ధాలన్నీ అత్యంత సాంద్రత, అత్యంత ఉష్ణము కలిగి, కాంతివేగం కంటే ఎన్నోరెట్లు వేగంతో భ్రమిస్తుంటాయి. ఈ ప్రదేశంలోకి, బయటనుంచి వచ్చిన కాంతికిరణాలుకూడా తిరిగి వెనక్కి మరలలేవు. అయితే, ఆధునిక సైన్స్‍యొక్క ఊహ ఏమి చెబుతుందంటే, ఈ కృష్ణబిలంలోకి, కాంతిగానీ; పదార్ధంగానీ, శక్తిగానీ ప్రవేశించినప్పుడు, అవి వచ్చిన మార్గంలోనే వెనక్కిపోలేక, అక్కడే చిక్కుకుపోతాయి. కానీ, ఆ బిలంయొక్క రెండవ లేదా క్రింద కొననుంచి ఇవి మరింత చైతన్యాన్ని పొంది, బయటకు వస్తుంటాయి. కానీ, దీనిని ఇప్పటివరకు స్పష్టంగా గుర్తించటం జరగలేదు. Mr.Eric Bresseur quoted, “ One idea is that a Blak Hole is connected to a White Whole. The matter falling into
a Black Hole would be spewed-out by a White Hole somewhereelse, possibly rejuvenated to the State of Primal Matter as produced  by   Big  Bang
- Hydrogen and Helium. కాబట్టి, ఈ విషయాల ఆధారంగా, స్థూల శరీరంనుండి విడివడిన చైతన్యశక్తి,  కృష్ణబిలాలగుండా ప్రయాణించి, సంపూర్ణ చైతన్యశక్తిగా రూపొంది, తిరిగి మరొక పుట్టుకను లేదా శరీరధారణను చేస్తుంది. దీని ఆధారంగానే,  పునరపి జననం, పునరపి మరణం ( మరణం అంటే మార్పు ) అని పెద్దలు చెప్పివుండవచ్చును.
ఉపసంహారం:-   ఆధునిక సైన్స్ బిగ్-బాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం, 14 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం పుట్టిందని చెప్పటం జరిగింది. ఇప్పటివరకు మనం, మనంవుండే పాలపుంత యొక్క పూర్తి రహస్యాలను తెలుసుకోలేదు. ఒక్క చంద్రుడుమీద తప్ప, మరే ఇతర గ్రహాలపైనా దిగలేదు; వాటి అనుపానాలు తెలియలేదు. విశ్వంలో, మన పాలపుంత (గెలాక్సీ) లాంటివి కోటానుకోట్లు వున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంటే, మనకు తెలియకుండా, మన కంటికి కనబడకుండా ఎన్నెన్నో వింతలు, విశేషాలు ఈ విశ్వంలో నిరంతరం ఆవిష్కరింపబడుతూనే వుండివుండాలి!!  అటువంటప్పుడు, పైన నేను పేర్కొన్న రెండు ప్రతిపాదనలు సంభవమే అని అనటానికి ఆస్కారంకూడా వుండి వుండవచ్చునుకదా?! అన్నీకాకపోయినా, ప్రపంచంలో, కొన్ని పరిశోధనల్లో, ‘ఈ జన్మలోనే కాకుండా, క్రిత జన్మలోకూడా నేను మనిషినే’ అని చెప్పిన సంఘటనలు నిజమేనని నిరూపించబడినాయి. అయినప్పటికీ, పరిపూర్ణ పరిశోధనలు పూర్తికాలేదు.
“ చిన్ని మనస్సు ”
ఒక పేద్ద ఆటస్థలం. జట్లు,జట్లుగా, పది-పదిహేనేళ్ళ వయసు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. వారి ఆటని చూస్తూ, తాము ఆనందిస్తూ, ఆడేవారిని చప్పట్లతో ఉత్సాహపరుస్తున్నారు చుట్టూవున్న పిల్లలు; పెద్దలు. అక్కడ అంతా కోలాహలంగా వుంది. ఒక గుంపులో ఒక పన్నేండేళ్ళ కుర్రాడుకూడా ఆటని చూస్తూ, కేరింతలు కొడుతున్నాడు. అతనికి ఆ ఆటంటే చాలా ఇష్టం. కానీ, అతను ఆడలేడు. కారణం అతనికి పోలియో వుంది. అతను పెద్దవాడయాడు, చదువయిపోయింది, ఉద్యోగంకూడా అయిపోయింది. ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగి. కానీ, అతనిలో క్రికెట్ ఆడాలన్న కోరికకు విశ్రాంతి దొరకలేదు.
అదొక సాంప్రదాయ కుటుంబం. ఇంటిపెద్ద సంగీత విద్వాంసుడు; ఇంట్లో అందరిపట్ల క్రమశిక్షణ ఎక్కువ. ఆయనకు ఒక కొడుకు; ఒక కూతురు. కూతురికి పెళ్ళి అయిపోయింది. కొడుకుకూడా చాలాబాగా పాడతాడు. తండ్రిలాగానే విద్వాంసుడయ్యాడు. అయితే, అతనికి సినిమాలంటే చాలా ఇష్టం. అందులోనూ, హీరో చిచ్చెరుపిడుగులాగా వుండి, ఆమ్మాయుల్ని ఏడిపిచ్చే విలన్లును; అమాయిక జనాల్ని మోసంచేసే మోసగాళ్ళను  డుష్కుం-డుష్‍కూంంంమ్  అంటూ తన్ని, వాళ్ళు పారిపోతుంటే, చెట్లెక్కి, గోడలెక్కి వాళ్ళని తరిమిపట్టుకొని, దొరికి తీసుకువచ్చే హీరో సినిమాలంటే మహాఇష్టం. కానీ ఏంలాభం! వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా సినిమాకి తీసుకువెళితే, త్యాగయ్య, భక్తరామదాసులాంటి సినిమాలకే తీసుకు వెళ్ళేవారు. ఇతనూ పెద్దవాడయాడు; గొప్ప,గొప్ప కచేరీలతో తీరికలేకుండా, వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టుకుంటూ ఇక విశ్రాంతి తీసుకునే వయకు వచ్చేసాడు. కానీ, తనకు ఇష్టమైన సినిమాలని, చూడాల్సిన వయసులో చూసి, ఆనందించలేకపోయాడు.
ఆయనొక గ్రామాధికారి. వయసు చిన్నదే. అయితే, తండ్రి చనిపోవటంతో తనకు గ్రామాధికారపత్యం వచ్చింది. తనకు ప్యాంట్, పొడుగుచేతుల చొక్కా వేసుకోవాలనివున్నా, అక్కడున్న మర్యాదలకు తలొగ్గి పంచె, లాల్చి, ఉత్తరీయాన్ని ధరించేవాడు. గ్రామానికి, పట్నంనుంచి కరగ్రాహకుడు ( కలెక్టర్ ) వచ్చినప్పుడు, ఆయన్ను చూసి, తనుకూడా సూటు, బూటు వేసుకోవాలన్న కోరిక పెరిగిపోయేది. అలా మనసులో కోరిక పెరుగుతుంటే, తన వయసుకూడా పెరిగిపోయింది; పిల్లలతో కలిసి, పట్నానికి వచ్చేసాడు; విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ, అతని కోరికమాత్రం నెరవేరలేదు.
కొడుకులిద్దరికీ క్రికెట్ అంటే ఇష్టంలేదు. వాళ్ళు టీ.వి. లోకూడా తమకి ఇష్టమైన టెన్నిస్, ఫుట్‍బాల్ ఆటల్నే చూసేవాళ్ళు. కానీ, మనవళ్ళుకు క్రికెట్ ఇంటే ఇష్టం. తనకు వయసు పెరిగి, పోలియోవలన ఎక్కువగా కదలలేక పోవటం వలన, తనకోసం కొడుకులు రెండో హాల్లో ఒక టీ.విని పెట్టించారు. తను అక్కడే క్రికెట్ చూస్తూ, పిల్లలందిరినీ చేర్చి, వాళ్ళకు ఆటగురించి చెప్పేవాడు. మనుమళ్ళు, వాళ్ళ స్నేహితులు పది-పన్నేండేళ్ళవాళ్ళే. వాళ్ళను చూస్తుంటే తన బాల్యం గుర్తుకువచ్చేది. పిల్లలూ నాకూ ఆడాలని వుందిరా అంటే, పిల్లలు కుర్చీలో కూర్చున్న తాతయ్యకు బంతినిచ్చి, బౌలింగ్ చెయ్యమన్నారు. కూర్చొనే బాల్ వేస్తే, బ్యాట్‍తో పిల్లలు గదిలోనే అటుఇటూ చిన్నగా ఆడారు. కొంచెం ఉత్సాహం ఎక్కువయిందేమో, బాల్‍ని గట్టిగా కొట్టేటప్పటికి బాల్ తగిలి, టీ.వి. పగిలిపోయింది. వాళ్ళ నాన్నలు కొడతారేమో, తాతయ్య అరుస్తాడేమోనని పిల్లలు పారిపోయారు. సాయింత్రానికి విషయం తెలిసిపోయింది. కొడుకులు పిల్లలకి నాలుగు తగిలించి, తండ్రిని పరోక్షంగా నాలుగు చీవాట్లు పెట్టారు. పాపం ఆయన మనసు బాధపడింది. ఆరోజు రాత్రి అన్నం తినకుండానే నిద్రపోయాడు. మర్నాడు ఉదయానికి ఆయనకు బాగా జ్వరం వచ్చింది. వారం రోజులైనా జ్వరం తగ్గలేదు. వైద్యుడు చూసి, ఈయన మనసులో ఏదో దిగులు పెట్టుకున్నారు; అందుకనే, జ్వరం పూర్తిగా తగ్గట్లేదు అని చెప్పి వెళ్ళాడు. ఈ వయసులో నాన్నకు దిగులు ఏముంటుందిలే అని కొడుకులు అంతగా పట్టించుకోలేదు. మనుమళ్ళు వచ్చి తాతయ్యను చూసిపోతున్నారు. పగలూ, రాత్రి, ఆ జ్వరంలోనే, ఆయన క్రికెట్ బౌలింగ్, బ్యాటింగ్ గురించి కలవరిస్తున్నాడు. పిల్లలూ, బాగా ఆడండి, మీకెందుకు నేనున్నానుగా! అని అంటున్నాడు. అప్పటికి వాళ్ళకు అర్ధమయ్యింది తాతయ్య దిగులు ఏమిటో! వెంటనే అందరూ మూట్లాడుకొని, వాళ్ళ నాన్నలు, అమ్మలుతో చెప్పారు తమకు అర్ధమైన రీతిలో. ఇప్పుడు కొడుకులుకూడా నిదానంగా ఆలోచించి, ఆయన్ను నెమ్మదిగా ముందు తోటలోకి తీసుకువచ్చి, కుర్చీలో కూర్చోబెట్టారు. పిల్లలు, వాళ్ళ స్నేహితులు అందరూ బ్యాటింగ్; ఫీల్డింగికి తయారయిపోయారు. తాతయ్యా నువ్వు బాల్‍వెయ్యి ఆడదాం అని అన్నారు. ముసలాయిన ఒక్కసారి అందరినీ చూసి, కొడుకుల కళ్ళల్లోకి చూసూడు. వాళ్ళుకూడా కళ్ళతోనే సమాధానం చెప్పారు. అంతే, ముసలాయినలో ఉత్సాహం వచ్చేసింది. నీరసంగావున్నా, కొంతసేపు ఆడారు; ఇక రెండు,మూడు రోజులు ఇదే తంతు. నాలుగో రోజుకి ఆయనకు జ్వరం తగ్గిపొయింది, హుషారు పెరిగిపోయింది.
సంక్రాంతి పండుగ, అందరికీ సెలవులు. ఇంట్లొఅంతా సందడి. అమ్మాయి పిల్లలు, అబ్బాయి పిల్లలు అందరూ ఇంట్లో ఒకటే అల్లరి; ఆటలూ, పాటలూ. ప్రొద్దున ఫలహారాలు అయిపోయినాయి. కొందరు హాల్లో, కొందరు మేడపైన గదుల్లో టీ.వి. చూస్తున్నారు, లేదా సీ.డీ పెట్టుకొని సినిమాలు చూస్తున్నారు. మన విద్వాంసులుగారు కూడా మనుమరాలుద్వారా  జేమ్స్‍బాండ్-116; మొనగాళ్ళకు మొనగాళ్ళు; చిక్కడు-దొరకడులాంటి సీ.డి.ల్ని తెప్పించుకున్నారు. తన గదిలొ కిటికీ తెరలన్నింటినీవేసి, జేమ్స్‍బాండ్ సినిమా చూట్టం మొదలుపెట్టారు. భార్యచేత, మధ్యలో కొన్ని చక్రాలు, పంటిక్రిందికోసం, తెప్పించుకున్నారు. పళ్ళెం అందుకుంటూనే, నీవుకూడా కూర్చొని చూడరాదూ, సినిమా బాగుంటుంది అంటూ చేయిపట్టుకొని తన ప్రక్కన్నే కూర్చోబెట్టుకున్నారు. సినిమా కధ మంచి రసపట్టులోవుంది. శత్రు గూఢచారిని జేమ్స్‍బాండ్ చిత్తు,చిత్తుగా కొట్టి, కట్టేసి, తన భుజంపైకెత్తుకొని, గోడదూకి, అటువైపునవున్న కారులో పడుకోబెట్టి ముందుకు వెళ్తున్నాడు. వెనుకనుంచి తుపాకుల శబ్దాలు; వాటిని తప్పించుకుంటూ బాండ్ ముందుకు దూసుకువెళ్తున్నాడు. ఇంతలో గదిలొకి పెద్దమనుమడు వచ్చి, తాతయ్య చెవిలో ఏదో రహస్యంగా చెప్పి, బయటకు తీసుకువెళ్ళాడు. పిల్లలుకూడా, బయట దొంగ-పోలీస్ ఆట ఆడుతున్నారు. ఏంటి విషయం? అని అడిగాడు తాతయ్య మనుమడ్ని. బయట, రెండిళ్ళ మధ్యవున్న గోడ అవతల శత్రువులు ఒక వస్తువును దాచిపెట్టారు; వాళ్ళు వచ్చేలోపల, నేను దాన్ని తీసుకువచ్చేయాలి. గోడ ఎత్తుగావుంది, నాకు కష్టంగావుంది కాబట్టి, నువ్వు అటువైపుదిగి, ఆ వస్తువును నాకు తెచ్చిఇవ్వాలి అని హుషారుగా, హడావిడిగా చెప్పేసాడు. ఈ వయస్సులో ఈ పని కష్టమే. గోడవరకు వెళ్ళి, చూసి, ఆగిపోయాడు. లాభంలేదురా, కష్టం మనుమడా అన్నాడు. ఏంటి తాతయ్యా, నువ్వు ఎప్పుడూ ఆ జేమ్స్‍బాండ్ సినిమాలు, డిష్కుం-డిష్కుం సినిమాలు చూస్తావు, ఈ చిన్న గోడను ఎక్కలేవా? అని ఎగతాళి చేసినంత స్థాయిలో ప్రశ్నవేసాడు. అంతే, తాతయ్యగారి కళ్ళముందు జేమ్స్‍బాండ్-116  గోడ ఎక్కి, దూకే దృశ్యం కనిపించింది. ఒక్క ఊపులో గోడదూకి, ఆ వస్తువుని ఇటువైపున్న మనుమడికి అందించి, మళ్ళీ గోడెక్కేసి, మనుమడి కళ్ళల్లోకి చూసాడు. మనుమడు కళ్ళల్లో మెరుపు. వాడు ఆ వస్తువుని తీసుకొని పరుగెత్తాడు. రెట్టింపు ఉత్సాహంతో ఈయన గోడ దూకేసాడు. కానీ, పది నిముషాల్లో, గదిలొ మంచంమీద మూలుగుతూ పడుకున్నాడు; డాక్టరుగారు నెప్పికి సూదిమందు ఇస్తున్నారు. చాలా ప్రమాదం తప్పిందని డాక్టర్ చెప్పేసివెళ్ళాడు.
ఇంట్లోవాళ్ళంతా ఆయన చుట్టొ చేరిపోయారు. జరిగింది ఏమిటో పిల్లవాడిద్వారా తెలుసుకున్నారు. ఇదేం పనులండీ, ఈ వయసులో మీకూ అంటూ ఆయన భార్య దీర్ఘాలుతీస్తే, పిల్లలు, అవును నాన్నా, మీరేంటి చిన్నవాళ్ళల్లాగా ఇలా చేసారు అని అడిగారు. మూలుగే ఆయన సమాధానం. ఇంతలో, మనుమడు పరుగెత్తుకుంటూవచ్చి, తాతయ్యా!, నీ సహాయంతో నేను శత్రువులందరినీ ఓడిచ్చేసాను! ధాంక్స్ తాతయ్యా అంటూ చెయ్యి నొక్కాడు. నాన్నా, తాతయ్య జేమ్స్‍బాండ్‍లాగా గోడదూకి వచ్చారు తెలుసా?! అని అందరికీ చెప్పాడు. ఇదంతా విని అందరూ నవ్వుకొని, నాన్నా, మీకు జేమ్స్‍బాండ్ యుద్ధాలు, జానప చిత్రాల్లో హీరో గాలిపటంద్వారా కోటగోడలు ఎక్కటంలాంటివి ఇష్టంవుంటే, ఆ చిత్రాల్ని కూర్చొని చూడండికానీ, వాటిని ఆచరణలో పెట్టకండి, ఇబ్బంది పడతాం అందరం అనుకుంటూ వెళ్ళిపోయారు. మన విద్వాంసులుగారు భార్య కళ్ళల్లోకి చూసి, కళ్ళెగరేసారు. ( పెద్దలు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి కూడా జేమ్స్‍బాండ్‍లాంటి యాక్షన్ చిత్రాలంటే చిన్నప్పటినుంచి ఇష్టమని ఒక టీ.వి. షోలో చెప్పినట్లు నాకు గుర్తు ).
ప్రకృతిలో బుద్ధి జీవుల్లో మనిషి మొదటివాడు. ఇతనికి రెండు ముఖ్య లక్షణాలున్నాయి. మొదటిది అనుకరుణ;  రెండవది ఆచరణ. ఒక ప్రక్రియను అనుకరిస్తూ, దానిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టే సంధికాలంలో, ముఖ్యంగా, యుక్తవయస్సులో, ఆ ‘విషయ-ప్రక్రియ’పై   ఇష్టాన్ని లేదా అయిష్టాన్ని ఏర్పరుచుకుంటాడు. మనసు అలవాటుపడిన ఇష్టమే కోరికగా స్థిరపడుతుంది – మనసు కలలుగంటుంది – కొన్ని కలలు కనురెప్పలను దాటి, నిజమవుతాయి;  కొన్ని కలలు కలల కడలిని దాటకుండానే కలలలోనే సమసిపోతాయి;  మరికొన్ని, కలల అలలలో ఉయ్యాలలూగుతూనే వుంటాయి – జీవిత చరమాంకం వరకు అవి వెంటాడుతూనేవుంటాయి.
ఆడవాళ్ళల్లోఅయినా, మగవాళ్ళల్లోఅయినా చిన్నప్పటి తీరని కోరికలు కొన్ని అలాగే ఉండిపోతాయి. కొందరికి సూటూ,బూటూ వేసుకొని తిరగాలనీ; కొందరికి డాక్టరో; పోలీస్ అధికారో, లేదా, ఉపాధ్యాయుడో కావాలని కోరికలుంటాయి. రకరకాల పరిస్థితుల దృష్ట్యా, అసక్యతవల్లగానీ, తాము చిన్నప్పుడుగానీ, ఉద్యోగం చేసే వయసులోగానీ, కలలుగన్న, కోరుకున్నవాటిని సాకారం చేసుకోలేకపొతారు. చూస్తుండగానే జీవితంలో రేపటి  పరుగులో, పరుగెత్తి, అలసి, సొలసి, చివరకు విశ్రాంతి తీసుకునే దశకు వచ్చేస్తారు. కానీ, వారి మనస్సులో, వారి కోరిక ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. ఒక వయసులో, డబ్బులున్నా, సంసార బాధ్యతలవల్ల తమ కోరికలను తీర్చుకోలేరు; మలి వయసులో, వాటికోసం పిల్లల్ని అడగటానికి మొహమాటం అడ్డువస్తుంది; ఒకవేళ అడిగినా, ఈ వయసులో అవి నీకు ఎందుకు అని అన్నా అనవచ్చు కొడుకులు; కొడుకుని అడిగితే, కోడలు ఏమంటుందో; ఒకవేళ వున్న ఒక్క కూతురుని అడిగితే? – ఊహూ! అల్లుడుకి తెలిస్తే హుందాగా వుండదేమో?
ఉపసంహారం:–    చిన్నప్పుడు, అందరికీ, అనేక కోరికలుంటాయి. అన్నింటినీ తీర్చుకోలేమేగానీ, కొన్నింటిని, కొంతవరకైనా నెరవేర్చుకోగలం. చిన్న పిల్లలుగా వున్నప్పుడు, మారాంచేసి, ఏది కోరినా, తల్లి,తండ్రులు వాటిని నిజంగా తీర్చటమో, లేదా, బొమ్మల రూపంలోనే వాటినిచ్చి, పిల్లల్ని ఊరడిస్తారు. చిన్న పిల్లలు-ముసలివాళ్ళు, వీళ్ళు మనసురీత్యా ఒకటేనంటారు. భౌతికంగానూ, పిల్లలు నాలుగు కాళ్ళమీద పాకుతే, ముసలివాళ్ళు కర్రబట్టుకొని మూడుకాళ్ళమీద నడుస్తారు. తమ చిన్న పిల్లల్ని, వాళ్ళ మనసెరిగి ఎట్లా వాళ్ళను చూసుకుంటారో,  కొడుకులు/కోడళ్ళు/అల్లుళ్ళుకూడా పెద్దవాళ్ళయిన తల్లి,తండ్రులను గమనిస్తూ, కనిపెట్టుకుంటూ, చిన్నప్పటి నెరవేరని వాళ్ళ కోరికలేమయినా వుంటే వాటిని సాధ్యమయిన రీతిలో నెరవేరిస్తే, రెపరెపలాడే ఆ పెద్దవాళ్ళ ‘చిన్ని మనస్సులు’ ఆనందంతో, తృప్తితో నిండిపోతాయి. ప్రశాంతంగా, పసిపాపల్లా వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి. వాళ్ళ కోరికల్ని తీర్చామన్న ఆనందం, తృప్తి పిల్లలికికూడా దక్కుతాయి. నేటి పెద్దవాళ్ళే  రేపటి ముసలివాళ్ళు కారా?!
నా వరకూ వస్తే – నా వయసు 57 ఏళ్ళు.  ముసలివాళ్ళ తరగతిలోకి ఇంకా రాలేదనుకోండి. అయినా… …  “గంట,గంటకూ  కూహూ, కూహూ అంటూ శబ్దంచేసే ఒక కుకూబర్డ్ గోడగడియారం కొనుక్కోవాలని వుంది. చిన్నప్పటి కోరిక ఇది. ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇంకా….  ఒక చిన్న టెలీస్కోప్; ఒక మైక్రోస్కోప్ కూడా కొనుక్కోవాలనివుంది. ఇంకా ప్రయత్నాలు ముమ్మరం చేయలేదు. మరి మీ మనస్సుల్లోని తీరని కోరికలేవైనా వుంటే బయటపెట్టి, సాధించటానికి ప్రయత్నించండి!! శుభస్యశీఘ్రం!!
“ నల్ల గొడుగు – తెల్ల గొడుగు ”
ఛత్రం సమర్పయామి అంటూ దేవుడికి షోడసోపచార పూజ చేసేటప్పుడు చెబుతారు. అంటే గొడుక్కి ఎంత ప్రాధ్యాన్యం వుందో మనకు తెలుస్తుంది.
మనకు తెలిసినంతవరకు ఎక్కువగా చూసేది నల్ల గొడుగు, తెల్ల గొడుగులనే. ఆధునిక కాలంలో రంగు గొడుగులు, రంగు,రంగుల కలబోత గొడుగులుకూడా వచ్చాయి. ఎండాకాలం, వర్షాకాలం వచ్చిందంటే, వీధి వెంబడి, “గొడుగులు బాగుచేస్తాం” అంటూ వాటిని బాగుచేసేవారు వచ్చేవాళ్ళు. ఎండనుంచి, వర్షంనుంచి కాపాడుకోవటానికోసం మనిషి ఎప్పటినుంచో ఈ గొడుగు వాడటాన్ని మొదలుపెట్టాడు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో ఈ గొడుగు వాడకం మనకు బాగా కనిపిస్తుంది. అడవులు, ఎడారులు, నదీతీరాలవెంబడి నివసించే వాళ్ళుకూడా తాటి ఆకులతో, ఈత ఆకులతో గొడుగులను తయారుచేసుకొని వాడటం మనం గమనిస్తూనే వుంటాం. నాటికి, నేటికీ గ్రామాల్లో మొగవాళ్ళు పనిమీద బయటకు బయలుదేరితే, తెల్లని దుస్తులు, నల్లటి గొడుగు లేకుండా బయటకే రారు.
ఇక రాజుల సంగతికివస్తే, పెద్ద గొడుగును ఆయనకు నీడగా పడుతూ వెంట ఒకళ్ళిద్దరు భటులు నడుస్తుంటారు. రాజుగారు ఏనుగుపైగానీ, రధంపైగానీ వెళ్తున్నప్పుడుకూడా గొడుగునివాడటం, అందునా అది ఒక్కొక్కసారి రాజదర్పానికికూడా గుర్తుగా వాడటం మనకు తెలిసిందే. యుద్ధాలలోకూడా రాజుల రధాలపై గొడుగు కనిపిస్తుంది మనకు. బలి చక్రవర్తిని భూమిలోకి అణగగొట్టటానికి వచ్చిన వామనుడుకూడా ఛత్రాన్ని పట్టేవచ్చాడు. మరిక దేవుళ్ళు సంగతీ! వారి దగ్గరికి వచ్చేసరికి ఛత్రాన్ని వాడటం భక్తి, మర్యాద, గౌరవ సూచకాలు. ఛత్రం అనగానే మనకు గుర్తుకువచ్చేది వినాయకుడు. ఛత్రం లేకుండా ఆయనకు పూజే చేయరుమరి!! మిగిలిన ఏ దేవుళ్ళను చూసినా (చిత్రాల్లో) గొడుగు కనిపిస్తుంది. దేవుడి ఊరేగింపు బయలుదేరిందంటే, రాజలాంచన చిహ్నంగా ముందు ఒకరు గొడుగు పట్టుకొని వస్తుంటే, వెనుక, రధంపై ఊరేగే స్వామికి ఆఛ్చాదనగా గొడుగుని తప్పకుండా పట్టటం మనం చూస్తూవుంటాం. అంతేకాదండీ బాబూ, నేటి ఆధునిక కాలంకూడా దేశాద్యక్షులు, ప్రధానులకు స్వాగతం చెప్పేటప్పుడు ఇప్పటికీ గొడుగును వాడుతున్నారుకూడా!!
ఇక నాటి, నేటి సినిమాల విషయానికివద్దాం. హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడతారు. సరదాగా పాడుకుంటూ పొలాలగట్లంబడి, తోటల వెంబడి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. అప్పుడు ఖచ్చితంగా వర్షం పడుతుంది. అప్పటివరకు మనకు గొడుగు కనిపించకపోయినా, ఉన్నట్లుండి హీరోయిన్ చేతిలో ఒక చిన్న గొడుగు కనిపిచ్చేస్తుంది. వాళ్ళిద్దరి వళ్ళంతా తడుస్తున్నా, ఇద్దరి తలలుమాత్రం గొడుగు క్రిందకు దూరి,  కళ్ళు,కళ్ళూ కలుస్తాయి. గొడుక్కి మన సినిమాల్లో ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఒక చిన్న ఉదాహరణని చెబుతా:   ఒక సినిమా. చాలా బాగుంది. ఒకతనికి ఆ సినిమా పిచ్చి,పిచ్చిగా నచ్చేసింది. ప్రతిరోజు, మూడు ఆటలకు తప్పనిసరిగా వచ్చి చూస్తున్నాడు. చూసి వెళ్ళేటప్పుడు గొణుక్కుంటూ వెళ్ళేవాడు. రోజూ ఇదే తంతు. తలుపు దగ్గర టికెట్లు తీసుకునే వ్యక్తి ఇతన్ని గమనించి, అసలు విషయాన్ని ఆరాతీసాడు. సంగతి తెలుసుకొని, అతను ముక్కున వేలేసుకున్నాడు. ఇంతకీ అతనికి ఏం తెలిసింది? సినిమాలో ముగింపు సన్నివేశంలో, ప్రేమికులైన హీరో, హీరోయిన్లు, ఒక నది ఒడ్డున కూర్చొని, నీళ్ళని చూస్తూ, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ వుంటారు. వాళ్ళ వీపుభాగం మనకు కనిపిస్తుంటుంది. ఇంతలో వర్షం పడుతుంది. హీరోయిన్ గొడుగుని అడ్డంపెట్తుంది. హీరో, హీరోయిన్ ముఖాన్ని దగ్గరుకు తీసుకొని, ఆమె పెదవులపై ముద్దు పెట్టుకోబోతాడు. అయితే, హీరోయున్  గొడుగుని  తలలు కనపడకుండా క్రిందకు దించుతుంది. ఆ ముద్దు దృశ్యం మనకు కనపడదు, సినిమా అయిపోతుంది. ఈ అభిమానికి ఆ దృశ్యం చూడాలని!! ఒక ఆటలో గొడుగు అడ్డంవచ్చినా, మరొక ఆటలో గొడుగు ప్రక్కకు జరిగి, ఆ దృశ్యం కనిపించకపోతుందా అని అతని ఆశ! అదండీ సినిమాల్లో  గొడుగు గొప్పతనం!
సరే, ఇక నల్లరంగు గొడుగు, తెల్లరంగు గొడుగుల విషయానికి వచ్చేద్దాం.
నల్లటి గొడుగు:   ఎంతదూరంలో వున్నా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది, చీకట్లో తప్ప. అసలు సప్తవర్ణాల్లో నీలంతప్ప, నలుపు అనే రంగే లేనేలేదు. ఇది మూడురంగుల కలయిక మాత్రమే. అసలు నలుపురంగు గానీ, మరే ఇతర రంగులైనా మన కంటికి ఎట్లా కనిపిస్తాయి. కాంతి కిరణం సప్తవర్ణ మిశ్రమం. ఒక గొడుగుకి నల్లరంగు వేసినప్పుడు, కాంతి కిరణం దానిపై పడితే, నలుపురంగుని తప్ప, మిగిలిన రంగులను అది తనలో కప్పివేసుకుంటుంది. అప్పుడు నల్లరంగు కాంతి మాత్రమే వెనక్కి తిరిగి, మన కంటిలో పడినప్పుడు, ఆ గొడుగుని నల్లరంగు గొడుగుగా మనం గుర్తిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి.
సామాన్యంగా, నలుపురంగుని ఎక్కువమంది ఇష్టపడరు. ఒక అశుభ సూచికంగా భావిస్తారు. ‘శని, యముడు’కి నలుపు ఇష్టం. వారంటే మనకు అయిష్టం!  అందుకే నలుపుని దూరంగా వుంచుతారు. చీకటికి, అజ్ఞానానికి నలుపు సంకేతం. అందువల్లకూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడరు. ఇక మరి, న్యాయమూర్తులు, న్యాయవాదులు నలుపు దుస్తులే వాడతారు. న్యాయంకోసం వారి దగ్గరికి వెళ్తాంకానీ, ఆ నల్లరంగుని మాత్రం మనం ఇష్టపడం. ఎందుకంటే, ఏమికనిపించకుండా చేయగలిగే నల్లని రంగులో, నిజాన్ని నేరేడు కాయగా చేసి, కప్పిపుచ్చి, అబద్దాన్ని గెలిపిస్తారేమోనన్న ఒక భయంతో!! మరి, ఇంకొక ప్రక్క చూస్తే, అయ్యప్పస్వామి భక్తులు నల్లని వస్త్రాలనే భక్తితో ధరిస్తారు. ఈ రెండు విషయాలు పరస్పరం విరుద్ధంగా వున్నట్లు అనిపిస్తాయి.
అయితే, ఈ నలుపు రంగులో ఒక విశిష్టమైన తత్త్వం ఇమిడి వున్నది. న్యాయమూర్తులు, న్యాయాన్ని చెప్పేటప్పుడు, తనవారని, పరాయివాళ్ళనీ చూడకుండా, వారిపట్ల తనకు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా, వారియొక్క ఉద్రేకాలతో మమైక్యం చెందకుండా, ఒక అతీతుడుగా న్యాయాన్ని చెప్పాలి. అందుకు గుర్తుగానే ఈ నలుపురంగు దుస్తులను వాడుతారు. అయ్యప్ప భక్తులుకూడా ఈ గుణాలకు అతీతంగా మండలం రోజులు శ్రద్ధా,భక్తులు కలిగివుండాలని, గుర్తుగా ఈ రంగు దుస్తులనే వాడతారు. పైనచెప్పినట్లుగా ‘ శని, యముడు ’ని తీసుకుంటే, వీరు చేసేపనులు ధర్మానికి కట్టుబడి వుంటాయి. వీరిద్దరూ ధర్మం తప్పినవారిపట్ల ఎటువంటి జాలి, దయ చూపించరు; ఎవరిపట్ల రాగద్వేషాలుండవు. మరి వీరు ధరించే దుస్తులుకూడా నలుపువే!! అయితే, తాము తప్పుచేసినా, దయా,దాక్షిణ్యాలు చూపించికపోతే, వారిపట్ల ఎవరికైనా ( మనమే! ) ఇష్టం వుండదుకదండీ! అందుకే నలుపురంగు బట్టలను వేసుకున్నవాళ్ళని చూసినా, నలుపురంగు వస్తువులను చూసినా, మన మనస్సు తప్పక ఒకింత దూరం జరిగిపోయి, అయిష్టతను ఏర్పరచుకుంటుంది;  అయిష్టతను ప్రదర్శిస్తూ వుంటుంది. కానీ, మనం అసలు తత్త్వాన్ని తెలుసుకోవాలికదా!
ఇక తెల్లరంగు గొడుగు:   అన్ని రంగుల మధ్య కలిసిపోతుంది; నల్లరంగులాగా కాకుండా, చేకటిలో కనిపిస్తుందికూడా! మరి సప్త వర్ణాల్లో నలుపుకి కొంచెం దగ్గరగా చెప్పబడే నీలం రంగు అన్నావున్నది. కానీ, తెలుపురంగు విషయానికివస్తే, ఈ రంగనేదేలేదు. అయినా, అందరికి తెలిసిన విషయమే అది. సప్తవర్ణ మిశ్రమమే తెలుపు!! అంటే, అన్ని రంగులని తనలో ఇముడ్చుకొని, తేట తెల్లని ఒకే రంగుని ఆవిష్కరిస్తుంది. హారంలో పూలెన్ని రకాలున్నా, పూలహారం అని అంటాం;  మానవుల్లో ఎన్ని రంగులున్నా, అందరినీ మానవులనే అంటాం; భగవత్ స్వరూపాలెన్నివున్నా భగవంతుడు ఒకడే అని అంటాం.  తెలుపురంగుకూడా అలాంటిదే!
తెలుపురంగుకికూడా ఒక విశిష్టమైన తత్త్వమేవున్నది. ఇది స్వఛ్చతకి, పారదర్శకతకు, స్నేహానికి, శాంతికి చిహ్నం. యుద్ధాల్లో, శాంతి, స్నేహ చిహ్నంగా తెలుపురంగు జండాను చూపిస్తారు. పూజలు చేసేటప్పుడు ధవళవస్త్రాల్ని వాడతాం. రాజుల రధాలపైన అయినా, దేవతల ఊరేగింపు ఉత్సవాల్లోనైనా, తెల్లని ఛత్రాన్ని వాడటం చూస్తాం. చనిపోయినవారి తరుపు కుటుంబ సభ్యులకు, ‘చలువ బట్టల’ని తెల్లని వస్త్రాలను ఇవ్వటం మన ఆచారం. చనిపోయిన సమయంలో, ఆత్మశాంతికి చిహ్నంగా ధవళవస్త్రాలను వాడటంకూడా మన ఆచారమే. తెలుపురంగుకు మరొక గొప్పతనంకూడా వున్నది. ఇంద్రుని ఐరావతం; తెల్లని అశ్వాలు; తెల్ల ఛామరం; తెల్లని పుష్పాలు; తెల్ల పావురాలు; తెల్ల తామరలు; తెల్ల హంసలు ఉఛ్చస్థితికి, ఉన్నతిస్థితికి, ఉత్తమ గుణాలకి ప్రతీకగా చెప్పబడతాయి.
ఉపసంహారం:-   ఇంతకీ ఈ గొడుగుల గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పాలి? మన మానవ జాతి,జాతంతా ఒకే గొడుగు క్రిందకు రావాలి;  మన దేశ ప్రజలందరూ జాతి పిత పట్టిన గొడుగుక్రిందకు రావాలి;  కష్ట,నష్టాలొచ్చినా, సుఖాలొచ్చినా కుటుంబ సభ్యులందరుగానీ,  దేశ ప్రజలందరుగానీ ఒకే  ధర్మమనే గొడుగు నీడలోనే బ్రతకాలి అని మనం ప్రతినిత్యం అంటుంటాం. కష్టాల్లో నిలిచిన ఆబాలగోపాలాన్నీ, గోవుల్ని,  గోపాలుడైన శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా పైకెత్తిపెట్టి, ఒక్కటిగా సమిష్టిపరిచి, సమక్యతను చాటాడు. ఏ ఎండకాగొడుగు పట్టాలన్న సామెతలో అంతరార్ధం ఏదిఏమయినప్పటికీ,  వైషమ్యాలు మరిచి, ఐకమత్యంతో, స్నేహభావంతో, ప్రేమభావంతో, పారదర్శకతకు, ప్రశాంతతకు చిహ్నమైన తెల్లనిరంగుగల గొడుగు క్రిందకే అందరూ రావాలని ఆశిద్దాం.   నల్లగొడుగు,  తెల్లగొడుగని మళ్ళీ రెండురకాలు; రెండురకాల ఆలోచనలు మనకెందుకు. ఒకటై, ఒకటిగా వుండాలనుకున్నాం కాబట్టి, అందరికి నచ్చేది, మెచ్చేది అయిన  తెల్లగొడుగు క్రిందకే వద్దాం. ఏమంటారుమరి.  సెలవ్.  స్వస్తి.
“ వర్తమానం ”
ఈ ప్రపంచంలో మనిషికివున్న ముందుచూపులాంటి గుణంవున్న చిన్ని చీమలు, తేనెటీగల్ని, మహాఅయితే ఇంకొన్ని చిన్న జీవుల్ని మినహాయిస్తే, పశు,పక్ష్యాదులలో, రేపటికోసం, తమకంటూ దాచుకొనే జీవులు లేవనే చెప్పాలి. ఈ విషయం చెప్పగానే, నా ఆధ్యాత్మిక ప్రత్యక్ష గురువులు శ్రీ కేసరి హనుమానుగారు చెప్పింది గుర్తుకువస్తుంది. ఆయన ఏం చెప్పేవారంటే:–
నువ్వు ఏమి సాధించాలన్నా “ మూడు వేళ్ళ ”  తత్త్వాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేవారు. చూపుడువేలు, మధ్యవేలు, ఉంగరపువేలు;  ఈ మూడింటిని చూపించి, అందులో చూపుడువేలుని భూతకాలానికి చిందినది;  మధ్యవేలు వర్తమానం;  ఉంగరపువేలు భవిష్యత్ కాలానికి చెందినవి అని చెబుతూ, చూపుడువేలును మడిచి, భూతకాలం, అంటే నిన్నటి రోజు గడిచిపోయింది;  దానిని ఈ రోజు అయిన వర్తమానానికి తీసుకురాలేం కదా! అని చెబుతూ,  ఉంగరపువేలును మడిచి, రేపు రాబోయే రోజును ఈనాటి వర్తమానంలోకి తీసుకురావటంకూడా అసంభవమేకదా? అని అడుగుతూ,  ఇక మిగిలింది  మధ్యవేలు, అది వర్తమానకాలం. మనం ఇప్పుడు వుండేది,  ఎప్పుడూ వుండేదీ  ఈ కాలంలోనే. భూతకాలంలో చేసిన పనుల్లో మంచి,చెడులను బేరీజువేసుకొని, వర్తమానంలో చేసే పనులను మరింత సమర్ధవంతంగా, సుస్థిరంగా చేయాలి;  వర్తమానంలో నీ చేతుల్లో వున్నదాన్ని ఏదో తెలియని ఆశతో, ఇతరులు చెప్పిన సలహాలు విని, రేపు చేసేద్దామని, ఈనాటిది రేపటికి వాయిదావేస్తే, వున్నది పోయిందీ, వుంచుకున్నదీ పోయిందీ అన్నట్లు అవుతుంది అని హెచ్చరిస్తూ, రేపు చేయాలనుకున్నదికూడా వీలున్నంతవరకు ఈరోజే, అంటే వర్తమానంలో చెయ్యి  అని చెప్పేవారు.
వర్తమానంలో, తాము నమ్మింది చేసి ఎందరో మహామహులయ్యారు. రేపటి రోజుమీద ఆశవున్నా, మనిషిలోని బద్దకం, ఈ రోజు చేయాల్సిన పనిని చేయనివ్వదు. ఇది, మనలో చాలామందికి అనుభవమే. శరీర ఆరోగ్యానికి వ్యాయామం మంచిది, రోజూ తప్పక చెయ్యండి అని చెబుతే, ప్రొద్దునే లేవటానికి అలారం పెట్టుకొని, అది మ్రోగగానే, దాని నోరునొక్కేసి, ఏది ఏమయినా సరే, రేపటినుంచి చేస్తాను అని సర్దిచెప్పుకొని, నిద్రపోతాం. అంటే వర్తమానంలోని ఆ కొన్ని గంటలు భూతకాలంలోకి దొర్లిపోయాయిగదా!!
చిన్నప్పుడు, వారాల పేర్లు నేర్పటానికి, ఒక పాట నేర్పేవారు ఉపాధ్యాయులు. ‘ఆదివారంనాడు అరటి మొలచింది;  సోమవారంనాడు సుడివేసి పెరిగింది.. …  ..’  అంటూ చెప్పేవారు. అసలు మొదటి రోజున మొలవటం అంటూ జరగకపోతే, ఆ తరువాత పిలక వేయటం, పెరగటం, కాయలు కాయటం మొదలైనవన్నీ జరిగేవి కాదుకదా! వర్తమానంకంటే, భవిష్యత్‍లో వచ్చే రేపటి రోజుపైన మనిషికి ఎంత ప్రీతో ఈ క్రింది కొన్ని వాక్యాలు చెబుతాయి. ఆఖరికి చిన్నపిల్లవాడికికూడా ఈ విషయంలో ఎటువంటి మినహాయింపు లేదేమో!! అని అనిపిస్తుంది. మనిషి మనస్తత్వమే అటువంటిది మరి.  మరి ఈ క్రింది వాక్యాలు చదవండి:-
* మరో ఆలోచన వచ్చిందంటే, చేస్తున్న పనినికూడా వదిలేసి, ఆశల ఆకాశంలోకి ఎగరాలని చూస్తాం;
* మరో మెట్టు ఎక్కేదుంటే, నిలుచున్న మెట్టును వెనక్కి తన్నేస్తాం (ముందూ, వెనకా చూసుకోకుండా);
* మరో ఆటబొమ్మ ఇస్తానంటే,  చిన్నపిల్లవాడుకూడా, చేతిలో వున్నదానిని వదులుకుంటాడు;
* మరో రోజు వుందంటే, ఈరోజును వదులుకొని, రేపటి రోజుకోసం ఆశతో ఎదురుచూస్తాం;
* మరో జన్మ వుందంటే, ఈ జన్మను వదులుకొని, వచ్చే జన్మకోసం, తపనతో, మరణించటానికి సిద్ధమవుతాం;
* భూమి తన చుట్టూ తాను తిరిగి వస్తుందేమోకానీ,  జరిగిపోయిన రోజు మరలరాదు;
* కోయల కూసిందని, మధుమాసం ముందే వస్తుందేమోకానీ; రేపటి రోజు ఈరోజు కాలేదు;
* వర్తమానంలో జీవించలేని మనిషి,  వర్తమానాన్ని ఆస్వాదించలేని మనిషి రేపటి రోజుని చూడలేడు.
“ ఉషోదయపు నడక ”
సుప్రభాతం. ఉదయం నాలుగు గంటల నలభైఐదు నిముషాలు అయింది. బయట కొక్కొరొక్కో అని కోడి కూత; దిండు ప్రక్కనున్న మొబైల్ లో అలారం మోగింది. పట్నంలో కోడి కూతపై మనం పూర్తిగా ఆధారపడలేము కదండీ!  అందుకనే మొబైల్ అలారం కూడా!! అదీగాక, తెల్లవారిందికాబట్టి కోడి కూసిందో, లేక ఆ రోజు భోజనంలోకి కోడిని పంపించే ఏర్పాట్లు చేస్తుంటే దాని గొంతు నొక్కుతుంటే కొక్కొరొకో అన్నదో మరి మనకు తెలియదుగదా!! అదీసంగతి. మంచం దిగి, పళ్ళు తోముకొని, ఐదు నుంచి ఆరు గంటలవరకు, ఒక గంట, ధ్యానం చేసుకున్నాను. ఆతరువాత తయారయి, సుప్రభాత కాలినడకకు బయలుదేరాను. ఇంటిలోపలి మొదటి అంకం పూర్తయింది.
ఆరుగంటలకు రహదారిమీదకు వచ్చాను. చల్లటిగాలి వంటికి తగిలి, ఒళ్ళు జిల్లుమంది. ఇది కార్తీకమాసంకదా!  కార్తీకమాసం రాబోయే సంక్రాంతికి సమారంభం. మరి, కొంత చలిగానే వుంటుంది. అటు,ఇటూ చూస్తూ, రోజూవచ్చేవాళ్ళు వచ్చారా లేదా అని చూస్తూ, అడుగులు ముందుకు వేస్తున్నాను. అక్కడక్కడా కోళ్ళు కొక్కొరొకో అని అంటున్నాయి. నిజానికి కోడికూతలో ఒక సందేశం వున్నది. సుఖాలకి అలవాటుపడి, అందులో నిద్రపోతున్న ఓ మనుషుల్లారా!  ఉషోదయం అయింది, నిద్ర లేవండి;  బద్దకాన్ని వీడండి;  బ్రతుకుబాటలో ముందుకు పదండి!!  అని చెప్పినట్లుగా వుంటుంది నాకు. కాదంటారా?
అడుగులు ముందుకు పడుతున్నాయి. పెద్ద రోడ్డుకు ప్రక్కన, మూసివున్న దుకాణాలముందు, దినపత్రికలవాళ్ళు, తమ దుకాణాలు తెరిచారు. అంటే, దినపత్రికలను సర్ది, పేపర్ బాయస్‍కి పంచి, అన్నివైపులకు పంపుతుంటారు. మరొకప్రక్క, రోడ్డుకు ప్రక్కన వెలసిన టీ, కాఫీ దుకాణాలు. గ్రుక్కెడు వేడినీళ్ళు మన నోట్లో పోసి, రెండురూపాయలందుకొని, తమ దైనందిన జీవనాన్ని సాగదీస్తుంటారు వీరు. ప్రొద్దునే పనికివెళ్ళే ఉద్యోగస్తులు ఒక కప్పు కాఫీ నోట్లోపోసుకొని, ( పాపం, వీళ్ళు ఇంట్లో తమ భార్యల్ని కాఫీ పెట్టమని కష్టపెట్టలేరు – ఎందుకంటే, అప్పటికే అన్నం, కూర చేసి డబ్బాల్లో పెట్టి ఇచ్చరాయే! ),  ఒక దినపత్రికను కొని, చదువుతూ తమ బస్సులకోసం ఎదురు చూస్తుంటారు. నా అడుగులు ముందుకు పడుతున్నాయి.
పెద్దరోడ్డును దాటి, ప్రక్క బాటలోకి నడిచాను. ఈ దోవలో రెండు కిలోమీటర్లు వరకు దుమ్ము, ధూళి వుండదు. స్వాగతం, సుస్వాగతం అని పలుకుతున్నాట్లుగా, దోవకిరువైపులా పచ్చని చెట్లు తలలూపుతూ పలకరిస్తున్నాయి. ఈ మధ్య, కొత్తగావస్తున్న కాలనీల్లో చెట్లను బాగానే పెంచుతున్నారు. వాతావరణానికీ మంచిదీ, మనకీ మంచిదే గదా! ఈ చెట్లను చూస్తుంటే, అవి మనకు  గురుసమానులుగా  అనిపిస్తాయి. ఎంతో విషయాన్ని మనకు బోధిస్తునట్లు తెలుస్తుంది. మనం వదిలిన గాలిని అవి పీల్చుకొని, మనకు, ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా, ప్రాణవాయువుని అందిస్తుంటాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన రహస్యాన్ని మనం పరిశీలించాలి. ప్రపంచంలో వున్న చరాచరములన్నీ ( మనిషి తప్ప ), తమ పని తాము చేసుకుంటూ, వీలున్నంతవరకు ఇతరులకు ఉపయోగపడుతూ ( చనిపోయిన తరువాతకూడానండి!! ) జీవిస్తాయేకానీ,  ఏ జీవి, మరొక జీవిని తమ కట్టుబానిసగా వాడుకోవు. కానీ, మనిషిమాత్రం, తనకున్న తెలివితేటలతో, జంతువుల్ని మేపి, తన పనిని వాటిచేత చేయించుకుంటాడు;  చెట్లను పెంచి, తన అవసరాలకు వాడుకుంటాడు. వాటివల్ల తనకు ఉపయోగం లేదనుకుంటే, నిర్దాక్షణ్యంగా వాటిని తొలగిస్తాడు. మరి, చెట్లు మనకు పూలు, పళ్ళని ఇస్తున్నాయి. ఎంతో ఎత్తు ఎదిగినా, ఒదిగివుంటాయి!!  వాటిని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ( శ్రీ దత్తాత్రేయులవారు తమ సహజ గురువుల్లో చెట్టునుకూడా ఒక గురువుగా పేర్కొన్నారు ).  నా నడక సాగుతున్నది.  మరో పాఠంకూడా మనం నేర్చుకునేది వున్నది ఈ చెట్లనుచూసి. రోడ్లకు ఇరువైపుల చెట్లనుంచి రాలి, పడిపోయి, పాదాలక్రింద, చక్రాలక్రింద నలిగిపోయిన రంగు,రంగుల పూలు. దూరంనుంచి చూడటానికి, పసుపచ్చని, ఎర్రని రంగుల తివాచీల్లాగా కనిపిస్తూ, మనకు సాదర స్వాగతం పలుకుతుంటాయి. రాలి, పడిపొయి, నలిగిపోయిన వాటిని చూస్తే, మన జీవితంతో పోల్చుకోవచ్చు. ఇంతేగదా ఈ జీవితం! అని మనస్సు వేదన పడుతుంది. కానీ, బాధపడక్కరలేదు. ఒక్కసారి, తలెత్తి, చెట్లపైకి చూస్తే, క్రొత్త పువ్వులు, విరబూసి, నవ్వుతూ మనల్ని పలకరిస్తాయి. క్రొత్త తరానికి స్వాగతం పలుకుతూ, వాటికి చోటివ్వాలికదా, అందుకే మేము ప్రక్కకు తొలిగాం అని ఆ రాలిన పూలు మనకు చెబుతున్నట్లు అనిపిస్తుంది. నిజమే, ఇదంతా జీవితంలో ఒక భాగమే!!  ఆ క్రొత్త పువ్వుల్ని చూస్తూ, నేను అడుగులు ముందుకు వేసాను.
ఆకాశంలో టప,టపమని శబ్దాలు. నేలపై కొంచెం దూరంలో టక,టకమని శబ్దాలు. పైకిచూస్తే, పావురాల గుంపులు, తెల్లని కొంగల బారులు తమ రెక్కల్ని టప,టపలాడిస్తూ, ముందుకు సాగుతుంటే, నాకు స్వాగతం పలుకుతునట్లనిపిస్తుంది. ప్రభాత సమయంలో ఒక్కసారలా ఎగరాలని వాటికి ఎవరు చెప్పారో ఏమో? బహుశా, వాటినిచూసే మనంకూడా నడక ప్రారంభించామేమో!  నాలుగు అడుగులు నడిచానే లేదో, నాముందు అడుగుల సవ్వళ్ళు. సిపాయుల గుంపులు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, దేశ రక్షణకోసం ఎప్పుడూ ముందడుగు వేస్తుంటామని వారు గుర్తుచేస్తునట్లుంది. ( మాది కంటో‍న్మెంట్ ఏరియా ).
పక్షుల్ని, సిపాయుల్ని చూసి కలిగిన ఉత్సాహంతో నా నడక సాగుతూనేవున్నది ముందుకు. రోడ్డుకు ప్రక్కన గుడి; గుడిలోంచి కౌసల్యా, సుప్రజా అంటూ సుప్రభాతం వినిపిస్తున్నది.  భక్తులువచ్చి, దణ్ణాలుపెట్టుకొని వెళ్తున్నారు. సమయంలేనివారు, చెప్పులిప్పి, రోడ్డుమీదనుండే ఒక నమస్కారం చేసుకొని వెళ్ళిపోతున్నారు. వారిని చూస్తూ నేను ముందుకు నడుస్తున్నాను. నిజానికి వ్యాపార లాభం కోసమైనా, మీ సేవకోసమే మేమున్నాం అన్నట్లుగా, వ్యాపారులు ప్రొద్దున్నే తమ దుకాణాలు తెరచి, పప్పులు, ఉప్పులు అందిస్తున్నారు. ఆడవాళ్ళు కొంతమంది, తమ ఇంటిముందు ఊడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గులు వేస్తున్నారు. అందులో కార్తీకమాసం కావటంతో, ఉదయానేలేచి, తలస్నానాదులు చేసి, పెద్ద బొట్టుతో, తల్లో పూలతో బయటకువచ్చి, నీళ్ళు చల్లి, ముగ్గులు వేస్తున్నారు. తమ వంతు సహాయంగా, మొగవాళ్ళు, పూజకోసం పూలను కోస్తున్నారు. ఆ పెద్దల జంటలను చూస్తూ, ఆనందంతో నేను ముందుకు నడుస్తూనే వున్నాను.
అక్కడక్కడ వీధుల మీద దుమ్ము లేస్తున్నది. వీధుల ప్రక్కన చిన్న,చిన్న మంటలు. వీధులను ఊడుస్తున్న పురపాలక కార్మికులు. మనం పడేసిన చెత్తా,చెదారాన్ని కొబ్బరిపుల్లల చీపుర్లతో ఊడ్చి, ప్రక్కనేసి, తగులబెడుతూవున్నారు. ఇవి సంక్రాంతి ముందు వేసే మంటల్లాగా వున్నాయి. ఈ రోడ్లు ఊడ్చే వాళ్ళల్లో ఎక్కువమంది ఆడవాళ్ళే వుంటారు. వారందరూ, చలివలన, తలకు తలపాగాలాంటివి చుట్టుకొని, చేతిలో పొడుగాటి కర్రకు కట్టిన పుల్లల చీపుర్లతో వీధులను శుభ్రంచేస్తుంటారు. వీరిని చూస్తుంటే నాకు రెండు విషయాలు స్పురిస్తాయి.  ఒకటి:–  ఆ స్త్రీలు, తలకు తలపాగా కట్టుకొని ( కాళికాదేవి కిరీటం పెట్టుకున్నట్లుగా ), చీపురు కర్రను రెండు చేతులతో వాలుగా పట్టుకొని ఊడుస్తుంటే, కాళికాదేవి త్రిశూలం పట్టి, మహిషాసుర మర్ధన చేస్తున్నట్లనిపిస్తుంది నాకు. దుమ్ము లేచిందని మనం ముక్కు మూసుకొని ప్రక్కకు నడిచినా, వాళ్ళు ప్రశాంతంగా తమ పని తాము చేసుకుంటూనే వుంటారు.  రెండవది:–  వాళ్ళు శుభ్రం చెస్తున్నది చెత్తా,చెదారాన్ని అయినా, మనుషుల మనస్సుల్లో, శరీరంలో పేరుకుపోయిన, వదలని కోరికల్ని, కుళ్ళుని,  సూదిమొనల్లాంటి చీపుర్లతో ( శూలం లాంటిది ) నిశ్చితంగా, నిర్భయంగా ఊడ్చి, ప్రోగుపెట్టి, మంటల్లో కాల్చి, బూడిదచేసి, మరలా పైకి లేవకుండా కళ్ళాపి చల్లుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అది తల్చుకొని, గుడి దగ్గర దణ్ణం పెట్టుకోకపోయినా, వీళ్ళకుమాత్రం మనస్సులో నమస్కరించి, ఆనందంతో మరల ముందుకు నడుస్తాను.
ఇక, త్రోవలో, సన్నటివాళ్ళు, అతి లావాటివాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఎదురుపడుతూ వుంటారు. కొంతమంది పూర్వపరిచయం వున్నవాళ్ళే; కొంతమంది క్రొత్తగా పరిచయం అవుతుంటారు. చిన్న,చిన్న పలకరింపులు, కుశెల ప్రశ్నెలు, మరల ముందుకు సాగే నడక. ఎవరినీ కించెపరిచే ఉద్దేశ్యం నాకు లేకపోయినా, అతి లావుగావుండి, వైద్యుల సలహాపై నడకను సాధన చేస్తున్న వాళ్ళను చూస్తే నాకు పెద్దలు చెప్పిన ఒక విషయం గురుకు వస్తుంది: “ పొట్టను నమ్మొచ్చుకానీ,  నాలుకని నమ్మరాదని ”. అయితే, లావుకు కారణాలు జన్యుపరమైనవికూడా అయివుండవచ్చు.
అలా ముందుకు నడుస్తుంటే, అక్కడక్కడ క్రొత్తగా కడుతున్న పెద్దపెద్ద భవంతులు, అపార్ట్‍మెంట్స్;  వాటి ప్రక్కనేవున్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు; అందులో ఆ భవంతులను కట్టే పనివాళ్ళు. ప్రొద్దున్నే లేచి, వంటా,వార్పూ ముగించుకొని, చద్దిఅన్నం తిని, మధ్యాహ్నం భోజనానికి డబ్బాల్లో అన్నం సర్దుకునే ప్రయత్నాల్లోవుండే ఆడవాళ్ళు కనిపిస్తుంటారు. మగవాళ్ళు, కొంతమంది, కడుతున్న ఇళ్ళను అన్నివైపులనుండి, రకరకాల కోణాలలో పరిశీలిస్తూ, కోణాలు సరిగ్గా వచ్చాయా లేదా అని చూస్తూ, పెద్దమేస్త్రి చెప్పిన సలహాలను వింటుంటారు. వాళ్ళల్లో, కొంతమంది, చాలాసేపు, తలపైకెత్తి, దాదాపు పూర్తికావస్తున్న ఆ భవనాలవైపు చూస్తూ, దీర్ఘాలోచనతో వున్నట్లు నాకు అనిపిస్తుంది. ప్రక్కనేవున్న పూరిగుడిశెల బ్రతుకులనుంచి ఎత్తైన ఆ భవనాల్లోకి చేరి, బ్రతకలేమా!  ఏనాటికైనా? అన్న ఆశ వారి మనస్సుల్లో ఉదయిస్తున్నదేమో అని ఈ ఉదయపువేళలో నా మనసులో అనిపిస్తుంది. వారి కోరిక నెరవేరాలని కోరుకుంటూ నా నడకలో తిరుగు ప్రయాణం మొదలుపెడతాను.
తిరుగు ప్రయాణం. సమయం ఆరున్న గంటలు. సూర్యుడు ఎర్రబారుతూ, మనోహరంగా కనిపిస్తుంటాడు. నేను నడుస్తుంటే, నాతోపాటే నడుస్తున్నట్లుగా వుంటాడు. నా వారైన చెట్లు, పువ్వులు, పక్షులు, చల్లని గాలులు నిన్ను పలకరించాయా అని అడిగినట్లనిపిస్తుంది. అన్నట్లు ఒక్క విషయం చెప్పటం మరిచాను. కొంతమంది జంతు ప్రేమికులు, తాము పెంచుకునే కుక్కల్ని తీసుకొని నడకకు వస్తుంటారు. చాలా కుక్కలు ఇళ్ళముందు పడుకొని, ఆ ఇళ్ళ యజమానులు, నడకకోసం, తలుపులు తీసుకొని బయటకు రాగానే, ఆ శబ్దాలకు లేచి, వాళ్ళ కళ్ళల్లో కళ్ళుపెట్టి ( మీరు గమనించండి ) చూస్తుంటాయి. నువ్వు, మమ్మల్ని పెంచుకోకపోయినా, ఏదో మాలో, స్వతహాగావున్న  విశ్వాసంతో,  మీ ఇంటిముందు రాత్రంతా కాపలా కాసాము;  దయతో మా ముఖాన తింటానికి ఏదైనా పడేయగలరా?  అని అడుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఆ వీధి కుక్కల్ని చూస్తుంటే.
ఉపసంహారం:–   ఆధ్యాత్మికత ప్రకృతి పరం. మనం ఏ కోణంలో, ఏ ధృక్పధంతో, ఏ విషయాన్నైనా చూస్తామో, ప్రకృతి ఆ విషయాన్ని అదే విధంగా ఆవిష్కరిస్తుంది!  మనం ప్రతి రోజూ నడిచే నడకలోకూడా ఆధ్యాత్మికతను చూడవచ్చు. కాలం ఎవరికోసం ఆగదు. అది ఎప్పుడూ “ ముందుకు నడుస్తూ ”నే వుంటుంది. ఏ జీవి అయినా కాలంతో నడవాల్సిందే. ‘నడవ’లేని బద్దకస్థుడు జీవిత మాధుర్యాన్ని అందుకోలేడు. అంతెందుకండీ – అసలు మనకు నడకను నేర్పినవారు ఇద్దరే ఇద్దరు. వాళ్ళు ఇరవైనాలుగు గంటలూ, మూడువందల అరవై ఐదు రోజులూ, పగలనకా, రాత్రనకా,  తూర్పునుంచి, పడమరకు;  పడమటనుంచి తూర్పుకు నడుస్తూనేవుంటారు. అదేనండి,  సూర్య,చంద్రులు. సరే, మా ఇళ్ళు వచ్చేసింది. సమయం ఏడు గంటలయింది. మరి నేనూ మిగతా పనులు నడిపించాలి;  చదువుతున్న మీరూ, మీమీ పనులను నడిపించాలిగదా! మరి ఇక నడవండి ముందుకు. తిరిగి, రేపు ఉదయం, నడకలో కలుద్దాం,  ఆనందంతో.  సెలవ్.
( “ సాహితీసంస్కారి శ్రీ ఎన్.ఎస్.మూర్తిగారికి ఈ నా వ్యాసాన్ని అంకితం చేస్తున్నాను. వారి దీనిని ఆమోదించగలరని ఆశిస్తూ… మాధవరావు. ” )
“ సకల జనుల సమ్మె ”
నేను ఒంటరిగా వున్నప్పుడు, మా ఇంటిముందున్న పచ్చని చెట్లను తదేకంగా చూస్తూవుండటం నాకు ఒక అలవాటు. ఎందుకో,ఏమోకాని, అవి నా స్నేహితుల్లాగా అనిపిస్తాయి. వాటి భాషా, నా భాషా ఒక్కటే అనిపిస్తుంది.
ఎప్పటిలాగే ఆ రోజుకూడా చెట్లని చూస్తూ వున్నాను. ఎందుకో ఏదో తేడా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది. అవి నీరసంగా, బలహీనంగా వున్నట్లు అనిపించింది. చలికాలంలో నల్లని కాకి కూడా తెల్లగా కనిపించినట్లుగా, ఆకుపచ్చని ఆకులతో మిలమిలా మెరిసే ఆకులన్ని తెల్లగా, బూడిద రంగుతో, జీవంలేనట్లుగా, కాలిపోయి, బూడిదయిన మానవ శరీరంలా కనిపిస్తున్నాయి. వాటివైపు తదేకంగా చూస్తుంటే, అవి నాతో తమ బాధను చెప్పటానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది. అయినా వాటి నోరు పెగులుతున్నట్లులేదు. వాటి భావాలు నాకు అందటంలేదు. సరే, నేనే వాటిని మరొకసారి పరీక్షగా చూసాను. అప్పుడు అర్ధమయింది వాటి సమస్య ఏమిటో. అమితంగా పెరిగిపోయిన వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి విపరీతంగా పైకిలేచి, ఆ పచ్చని ఆకులను కప్పివేసాయి. తమ మిత్రుడు సూర్యుడు తోడొచ్చినా, పత్రహరితాన్ని తయారుచేసుకొనే స్థితిలో లేవు పాపం ఆ ఆకులు!!
నా మనసు గిలగిలలాడిపోయింది. నా నేస్తాలకి ఏదైనా సహాయం చేయాలి. వెంటనే చక్కని ఆలోచన వచ్చింది. మోటర్ ఆన్ చేసి, నీళ్ళగొట్టంతో ఆ మొక్కలపై నీళ్ళు పిచికారీచేసి వాటిని శుభ్రం చేద్దామనుకున్నా. అంతే, వెంటనే నా ఆలోచనను యుద్ధప్రాతిపదికనన అమలు పరచటానికి రంగంలోకి దిగాను. మోటర్ ఆన్ చేసాను; ఎంతో ఆశతో మొక్కల కొమ్మలు, రెమ్మలు నావైపుకు వాలాయి. చెప్పానుగదా మా భాష ఒకటేనని. ప్చ్!  కరెంట్ లేదు.అప్పుడు గుర్తుకువచ్చింది “ సకల జనుల సమ్మె ” వలన విద్యుత్ ఉత్త్పత్తి లేక కరెంట్ రాదని! అవి, నేను ఎంతో నిరుత్సాహపడిపోయాం. ఇంతలో, మా మనోభావాలను, బాధను అర్ధంచేసుకున్నాయో ఏమో, కనిపించని మేఘాలు ఒక్కసారిగా పెద్ద వర్షాన్ని కురిపించాయి. మొక్కలపై వున్న దుమ్ము, ధూళి అంతాపోయి, పచ్చని ఆకులు కొత్త  పెళ్ళికూతురులాగా మిలమిలలాడాయి. అంతా ఆనందం. ఆ క్షణం!!
ఉపసంహారం:–   కాలుష్యం, సమ్మెలు మనుషులనే కాదు, నోరులేని మూగజీవాలను,  పచ్చని చెట్లనుకూడా  దెబ్బతీస్తాయి.
“ తారా చంద్రులు ”
అది వర్షఋతువు. తొలకర్లు మొదలయ్యాయ్. ఒక పెళ్ళికి వెళ్ళాను. సుమూహూర్తం రాత్రి ఎనిమిది గంటలకి. సాయింత్రం ఆరు గంటలైంది. విడిది ఇంట్లో వున్నాను. వసారాలో కూర్చొని ప్రకృతి శోభని చూస్తూ, ఆనందిస్తున్నాను. ఆ శోభను చూసింది చూస్తున్నట్లుగా, పెళ్ళి కబుర్లతోపాటు మీతో చెప్పాలనుకున్నాను. నేను చెప్పే వర్ణలనుబట్టి పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు, విచ్చేసిన అతిథులు ఎవరో మీరే ఊహించుకొని, తెలుసుకోవచ్చు. మరి నా ఊహల మనోరథంపై మీ ఊహల్నికూడా ఎక్కించి నాతోపాటుగా ముందుకు పదండి!!
అది పెద్ద కుటింబీకుల వారింట్లో పెళ్ళి. మరి పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా వుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. భూదేవంత అలుగు; అంతటా రంగవల్లులతో అలిగారు; ఆకాశమంత పందిరి వేసారు. పందిరి వైపుకు తలపైకెత్తిచూస్తే, నీలిరంగు వస్త్రంతో అలంకరించారు. చిన్న,చిన్న దీపాలు అసంఖ్యాకంగా పందిరికి అలంకరించారు. అవి నక్షత్రాల్లా మినుకు,మినుకు మంటున్నాయి. ఎటుచూసినా పచ్చని ఆకుల తోరణాలు. పచ్చని ఎత్తైన చెట్లు. అవి ఊగుతుంటే, విచ్చేసిన అతిథులకు నౌకర్లు వింజామరలు వీస్తున్నట్లుగా అనిపిస్తున్నది. చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి. ఆ గాలిలో తొలకరి వర్షపు జల్లుల వాసనలుకూడా కలిసివున్నట్లు అనిపిస్తున్నది. విచ్చేస్తున్న అంతులేని అతిథులకు పన్నీరు నీటిని చిలకరించాలంటే కష్టమనుకున్నారేమోమరి ఆ పెళ్ళిపెద్దలు, ఆ పిల్లగాలులలోనే రకరకాల పూల పరిమళాల ద్రవ్యాలను కలిపివేసినట్లున్నారు. అందుకే చక్కటి పూల సుగంధాల పరిమళాలు అందరినీ తాకుతున్నాయి. హాయిగా వుంది.
అధి సంధ్యాసమయం. ఆరున్నర గంటలైంది. ఎంతోమంది ఆహూతులు పెళ్ళికి తరలివస్తుంటే, ఒక స్పురధ్రూపి మాత్రం రోజంతా తిరిగి,తిరిగి, పెళ్ళి పనులుచేసి, అలసిపోయాడో ఏమో, ఎర్రబారిన ముఖంతో, విశ్రాంతి తీసుకోవాలన్నట్లుగా ప్రక్కకు నిష్క్రమించాడు. ఆయన అటు వెళ్ళాడోలేడో, కిచకిచమంటూ కొన్నివేల పక్షులు ఆ చుట్టుప్రక్కలున్న చెట్లపైకి వచ్చి చేరుకుంటున్నాయి. వాటి కిలకిలారావాలు చూస్తే, పెళ్ళి సందడి అంతా వాటిదే అన్నట్లుగావుంది. ఒక్కసారి అలా నలువైపులా  చూస్తే, ఆకాశంలో, వర్షానికిముందు, అటూఇటూ పరుగాడే మబ్బుల్లా, పెళ్ళిపెద్దలు సందడిచేస్తూ తిరిగుతున్నారు. చీకటి పడింది. ఎటుచూసినా దేదీప్యమానంగా దీపాలు వెలగటం మొదలయ్యాయి. ఆ దీపాల వెలుతురులో,  చీకటి ఎటుపోయిందో ఏమో, ముఖం చాటేసుకొని పోయింది.
అది పెళ్ళి ముహూర్తం సమీపిస్తున్న సమయం. పెళ్ళికొడుకువారి కుటుంబం పెద్ద బలగమే వున్న కుటుంబం. పెళ్ళికొడుకు వాళ్ళు   తొమ్మిదిమంది అన్నదమ్ములు.  పెళ్ళికొడుకు పందిట్లోకి రాజసంగా విచ్చేసాడు. అతనికి తోడుగా ఒక కుందేలును, ఒక ముసలమ్మను తెచ్చుకున్నాడు. పెళ్ళికొడుకు చాలా అందంగా, నిండుగా వున్నాడు. చూసిన వాళ్ళంతా చంద్రుడులాగా వున్నాడని చెప్పుకుంటున్నారు. అతని అన్నదమ్ములందరూ అతని చుట్టూ, నవగ్రహాల్లా,  కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో, ఒకవైపు కలకలం రేగింది. చూస్తే, పెళ్ళి కూతుర్ని తీసుకొని వస్తున్నారు. పెళ్ళికూతురి పేరు తార. ఆమె కుటుంబంకూడా చాలా పెద్దదే. పెళ్ళికూతురి అక్కా,చెల్లెళ్ళు మొత్తం  ఇరవైఏడు  మంది. పెళ్ళికూతురుతోసహా అందరూ చక్కని చుక్కలే. మిలమిలా మెరుస్తూ, తళుకులీనుతున్నారు. పెళ్ళికూతుర్ని చూసి, విచ్చేసిన వారంతా వీరిద్దరూ  తారాచంద్రుల్లాగా  వున్నారని అనుకుంటున్నారు. పెళ్ళికూతురు పందిట్లోకి వచ్చేసిందన్న విషయం తెలుసుకొని, పెళ్ళికొడుకు, ఉత్సాహంతొ, క్రీగంట పెళ్ళికూతుర్ని చూసి, చిరుమందహాసం చేసాడు. ఆ మందహాసం పెళ్ళికూతురుతో సహా చుట్టూవున్న ఆమె అక్కచెల్లెళ్ళ గుండెల్లో గుబులు రేపింది. ఒక్క క్షణం వారందరి చూపులు అతని చూపులతో కలిసిపోయాయి.  అంతే,  అదే  సుముహూర్తం!!  మనసా, వాచా,  తారల్లాంటి ఆ  ఇరవైఏడు మంది చంద్రుడిలావున్న ఆ పెళ్ళికొడుకునే తమ భర్తగా స్వీకరించారు. అంతే, ఆకాశమంతా తారల వెలుగులతో వెలిగిపోయింది. పెళ్ళి సందడి హోరు హెచ్చింది. పిల్లగాలులే సన్నాయి శబ్దాలు చేసాయి;  ఉరుములు డోలు శబ్దాలు చేసాయి;  చెట్లపైవున్న వేలాది పక్షులు ఒక్క ఉదుటున ఆకాశంలోకి శబ్దాలు చేసుకుంటూ ఎగిరాయి. వాటి కిలకిలారావాలే పెళ్ళి మంత్రాల్లా, పురోహితుల ఆశీర్వాదాల్లా వినిపించాయి.
అది ఒక విచిత్రమైన దృశ్యం;  సన్నివేశం కూడా. ఆకాశంలో, చంద్రుడి చుట్టూ గూడు కట్టివుంటే తప్పక వర్షం పడుతుంది అని చెబుతారు. ఆ దృశ్యం అమోఘంగా వుంటుంది చూడటానికి. ఇప్పుడు, ఇక్కడకూడా, చంద్రుడిలాంటి పెళ్ళికొడుకు చుట్టూ ఆ  ఇరవైఏడు మంది నవకన్యా తారలు గుమిగూడారు. మరి విచ్చేసిన అతిథులందరూ వారికి అభినందనలు తెలిపారు.  అక్షింతలు చల్లబోతున్నారు. ఇంతలో, నా కంటికి ముందు రెండు పెద్ద మబ్బుతెరలు కనిపించాయి. నేను అనుకున్నంతా అయింది. చినుకులు పడటం మొదలయింది. వివాహ సమయంలో వర్షం పడటం శుభసూచికం అంటారు. మరి, ఆ పెళ్ళిపెద్దలు చల్లుతున్న అక్షింతలే వానచినుకులు కాబోలు!!  మరి నా దృశ్యకావ్య యాత్ర ఇక్కడితో సమాప్తమైతే,  ఆ మబ్బులచాటున, చిటపట చినుకుల మాపులో, ఆ నవదంపతుల శృంగార, సంసార యాత్రలో మొదటి రాత్రి శుభారంభమయింది.
ఉపసంహారం:–   అన్నం పరమాత్మ స్వరూపమంటారు. ఆ అన్నరసంనుంచి పుట్టినవారే జీవులు. అంటే, జీవులకు ఆధారం అన్నమయితే, అన్నానికి ఆధారం నీరు;  నీటికి ఆధారం వర్షం. పంటమొక్కలకు హరితాన్ని అందించేది సూర్యుడు అయినా, మొక్కలకు  జవ,సత్త్వాలిచ్చి, కాపుకు వచ్చేటట్లు చేసేది  చంద్రకాంతే!! అందుకనే, మనం సూర్యమానాన్నికంటే,  చంద్రమానాన్ని అనుసరిస్తూవుంటాం.  జాతక లగ్నంలోకూడా, చంద్రుడు ఏ రాశిలోవుంటే, ఆ రాశినే  జన్మరాశిగా పరిగణిస్తాం.  జీవితమనే వ్యవసాయంలో, భార్యా,భర్తలు  తారాచంద్రుల్లాగా అన్యోన్యంగావుంటే, వారిపై  పెద్దల ఆశీర్వచనాలు వర్షపు జల్లుల్లాగా కురుస్తూనేవుంటాయి.   సర్వే జనా సుఖినో భవంత్|     స్వస్తి|